వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటిరిగా బరిలోకి దిగనున్న ఎమ్ఐఎమ్

|
Google Oneindia TeluguNews

రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయా పార్టీలు ఇప్పటికే పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకున్న ఎమ్ఐఎమ్ తాజగా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. దీంతో స్థానిక పార్టీ అయిన ప్రకాశ్ అంబేద్కర్ అధినేతగా ఉన్న వీబీఏ అనే పార్టీతో పొత్తులు తెగతెంపులు చేసుకుంది.. గతంలో జరిగిన ఎన్నికల్లో వీబీఏతో జరిగిన పోత్తులో అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ఇద్దరి బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టారు.

తెలంగాణతో పాటు మహారాష్ట్రాలో ఎమ్ఐఎమ్ పార్టీకి ప్రాబల్యం ఉన్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో తెలంగాణలోని హైదరాబాద్ లోక్‌సభ స్థానంతో పాటు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లోక్‌సభ స్థానం నుండి మరో సభ్యున్ని గెలుచుకుంది. దీంతో ఎమ్ఐఎమ్‌కు గతంలో ఔరంగాబాద్ సెంట్రల్ అసెంబ్లీ నుండి ఇంతియాజ్ జలీల్ సయ్యద్ ఎమ్మెల్యేగా గెలుపోందాడు. అయితే ఇటివల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఔరంగాబాద్ నుండి పోటీ చేసి గెలిచాడు. దీంతో మరోసారి మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ పోల్స్ పై ఆపార్టీ దృష్టి సారించింది. గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన వీబీఏ పార్టీతో కూడ తిరిగి పోటీ చేసేందుకు సన్నద్దంగా లేమని ప్రకటించింది.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు ఔరంగాబాద్‌లో సమావేశం అయ్యారు.

AIMIM called off its alliance with Prakash Ambedkar’s Vanchit Bahujan Aghadi

సమావేశంలో భాగంగానే వీబీఏకు కేవలం ఎనిమిది సీట్లను కేటాయించడంతో దాన్ని తిరస్కరించినట్టు వీబీఏ అధినేత ప్రకాశ్ అంబేద్కర్ తెలిపారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 24 స్థానాల్లో ఎమ్ఐఎమ్ పోటీ చేయగా రెండు స్థానాల్లో గెలుపోందింది. దీనికి తోడు ఎంపీ స్థానం కూడ రావడంతో మరింత ఉత్సహాంగా పోటీలోకి దిగేందుకు ఎమ్ఐఎమ్ సిద్దమైంది.

English summary
Ahead of the Maharashtra Assembly polls slated for later this year, All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM) called off its alliance with Prakash Ambedkar’s Vanchit Bahujan Aghadi (VBA) reneging their earlier discussions of seat-sharing as both parties were unable to reach a “comfortable figure of seat distribution”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X