ఎంఐఎం చీఫ్ అసాదుద్దీన్ ఓవైసీ రాముడి వంశస్తుడు, ఇరాన్ నుంచి రాలేదు, బీజేపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్ !
లక్నో: ఉత్తరప్రదేశ్ శాసన సభ ఎన్నికల వేడి రానురాను రసవత్తరంగా మారిపోయింది. ఉత్తరప్రదేశ్ లో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి ఆ రాష్ట్రంలో అధికారం దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా కొనసాగిన కొందరు బీజేపీ నాయకులు ఎన్నికలకు కొన్ని వారాల ముందు బీజేపీకి గుడ్ బాయ్ చెప్పేసి ఎస్పీలో చేరిపోయారు. ఉత్తరప్రదేశ్ లో అధికారమే లక్షంగా బీజేపీతో పాటు ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు పోరాడుతున్నాయి.
ఇదే సమయంలో ఏఐఎంఐఎం చీఫ్, ఆ పార్టీ ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ మీద బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ తనకు మంచి స్నేహితుడని, ఆయన రాముడి వంశస్తుడు అని, ఆయన ఇరాన్ నుంచి రాలేదని బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్దరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్, అసాదుద్దీన్ ఓవైసీ రాజ్యం ఏలేయాలని పగటి కలలు కంటున్నారని బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వ్యంగంగా ఎద్దేవ చేశారు.
Hijab
Row:
కాలేజ్
లు
రీఓపెన్,
ఎక్ట్స్రాలు
చేస్తే
?,
రంగంలోకి
కేఎస్ఆర్పీ,
విద్యార్థుల
ఉత్సాహం
!

అసాదుద్దీన్ ఓవైసీ రాముడి వంశస్తుడు
ఏఐఎంఐఎం చీఫ్, ఆ పార్టీ ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ మీద ఉత్దరప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ తనకు మంచి స్నేహితుడని, ఆయన రాముడి వంశస్తుడు అని, ఆయన ఇరాన్ నుంచి రాలేదని బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అఖిలేప్ యాదవ్, ఓవైసీ పగటి కలలు కంటున్నారు
ఉత్దరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్, అసాదుద్దీన్ ఓవైసీ రాజ్యం ఏలేయాలని పగటి కలలు కంటున్నారని బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వ్యంగంగా ఎద్దేవ చేశారు. ముస్లీం ఓటర్లను అడ్డం పెట్టుకుని వారు కళ్లు రాజకీయాలు చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారని, అఖిలేష్ యాదవ్, అసాదుద్దీన్ ఓవైసీ ఎత్తుగడలను ఉత్తరప్రదేశ్ ప్రజలు తిప్పికొడతారని, కచ్చితంగా బీజేపీకే ఓటు వేస్తారని బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ జోస్యం చెప్పారు.

కొడుకు కోసం ప్రచారం చేస్తున్న బీజేపీ ఎంపీ
బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కుమారుడు ప్రతీక్ భూషణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ లోని గూండా శాసన సభ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తన కొడుకును గెలిపించాలని బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఆ నియోజక వర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. అసాదుద్దీన్ ఓవైసీ మన రాముడి వంశస్తుడు అని, ఆయన ముస్లీం కాదని, తనకు చిన్ననాటి స్నేహితుడు అని బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వ్యంగంగా అన్నారు.

అఖిలేష్ యాదవ్ ఫ్యామిలీ ద్రోహి
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మీద బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. కన్నతండ్రి, సొంత చిన్నానకు ద్రోహం చేసిన అఖిలేష్ యాదవ్ ఇప్పుడు సిగ్గులేకుండా ప్రజల ముందుకు వచ్చి ఎస్పీని గెలిపించాలని అడుగుతున్నాడని, ఫ్యామిలీకే ద్రోహం చేసిన అఖిలేష్ యాదవ్ ప్రజలకు ద్రోహం చెయ్యడని నమ్మకం ఏమిటని బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ యాదవ్ ఎస్పీ నాయకులను ప్రశ్నించారు.

అధికారం కోసం ఆఖరి పోరాటం
ఉత్తరప్రదేశ్ శాసన సభ ఎన్నికల వేడి రానురాను రసవత్తరంగా మారిపోయింది. ఉత్తరప్రదేశ్ లో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి ఆ రాష్ట్రంలో అధికారం దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా కొనసాగిన కొందరు బీజేపీ నాయకులు ఎన్నికలకు కొన్ని వారాల ముందు బీజేపీకి గుడ్ బాయ్ చెప్పేసి ఎస్పీలో చేరిపోయారు. ఉత్తరప్రదేశ్ లో అధికారమే లక్షంగా బీజేపీతో పాటు ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు పోరాడుతున్నాయి