వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూటు మార్చిన ఓవైసీ.. మహారాష్ట్ర ఎన్నికల్లో సెన్సేషనల్ స్ట్రాటజీ.. అంబేద్కర్ మనవడితో

|
Google Oneindia TeluguNews

ముంబై: అఖిల భారత మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ.. తన వ్యూహాన్ని సమూలంగా మార్చేశారు. మజ్లిస్ అంటే ముస్లింల పార్టీ అనే ముద్రను చెరిపేసే ప్రయత్నంలో పడ్డారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రాబల్యాన్ని నిరూపించుకునే దిశగా సరికొత్త ఎత్తులను వేస్తున్నారు. ఇందులో భాగంగా- రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ ఏర్పాటు చేసిన పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా మజ్లిస్ తరఫున ఈ సారి ఏకంగా 30 శాతం మంది హిందూ అభ్యర్థులకు టికెట్లను ఇచ్చారు.

ఈ దేశానికి మైనారిటీల కంటే ఎలుకలతోనే అధిక ప్రమాదం: అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలుఈ దేశానికి మైనారిటీల కంటే ఎలుకలతోనే అధిక ప్రమాదం: అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

 మారిన మజ్లిస్ వ్యూహం..

మారిన మజ్లిస్ వ్యూహం..

ఈ సారి ఎన్నికల వ్యూహాన్ని మజ్లిస్ నాయకత్వం సమూలంగా మార్చేసింది. ముస్లిం పార్టీ అనే ముద్రను తుడిచి పెట్టే ప్రయత్నాలకు ఒవైసీ దిగినట్లు కనిపిస్తోంది. ఈ సారి పార్టీ ప్రకటించిన అభ్యర్థుల్లో 30 శాతం టికెట్లను హిందువులకు కేటాయించారు. ఈ ఎన్నికల్లో మజ్లిస్ మొత్తం 44 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. దీనికి సంబంధించిన అభ్యర్థుల జాబితాను మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ విడుదల చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పోటీ చేసిన అసెంబ్లీ స్థానాలు 24 మాత్రమే. ఈ సారి ఈ సంఖ్యను 44కు పెంచింది. 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో 44 సీట్లలో అభ్యర్థులను ప్రకటించింది.

హిందువుల ఓటు బ్యాంకుపై కన్ను..

హిందువుల ఓటు బ్యాంకుపై కన్ను..

ఈ సారి హిందువుల ఓటు బ్యాంకు అధికంగా ఉన్న నియెజకవర్గాల్లో మజ్లిస్ తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టడం చర్చనీయాంశమైంది. ఆయా స్థానాల్లో హిందు అభ్యర్థులకు టికెట్ ను కేటాయించారు. స్థానికంగా మంచి పేరు ఉన్న అభ్యర్థులను నిలబెట్టామని మహారాష్ట్ర మజ్లిస్ విభాగం నాయకులు చెబుతున్నారు. 2014 నాటి ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ఇద్దరు మాత్రమే గెలిచారని, ఈ సారి ఈ సంఖ్యను మరింత పెంచుకుంటామని వారు ధీమాగా చెబుతున్నారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని వెళ్లే వారిని, ఉన్నత విద్యావంతులకు టికెట్లు ఇచ్చామని, ఖచ్చితంగా ఆశించిన ఫలితాలు వెలువడుతాయని వారు స్పష్టం చేస్తున్నారు.

ప్రకాశ్ అంబేద్కర్ పార్టీతో పొత్తు..

ప్రకాశ్ అంబేద్కర్ పార్టీతో పొత్తు..

ప్రముఖ సంఘ సేవకుడు ప్రకాశ్ అంబేద్కర్ ఏర్పాటు చేసిన వంచిత్ బహుజన్ అఘాడి ( వీబీఏ)తో మజ్లిస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడే ప్రకాశ్ అంబేద్కర్. వీబీఏతో పొత్తు పెట్టుకోవడం వల్ల దళితులు, మైనారిటీలో ఓట్లు చీలవని మజ్లిస్ నాయకులు అంచనా వేస్తున్నారు. దళితుల ఓట్లు తమకే పడతాయని ఆశిస్తున్నారు. వీబీఏతో మజ్లిస్ పొత్తు పెట్టుకోవడం ఇదే తొలిసారి. 2014 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. కొన్ని నియోజకవర్గాల్లో మజ్లిస్ కంటే అధిక ఓట్లను సాధించింది వీబీఏ. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఓట్లు చీలకుండా ఉండటానికి ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు చెబుతున్నారు.

మజ్లిస్ ప్రకటించిన హిందూ అభ్యర్థులు వీరే..

మజ్లిస్ ప్రకటించిన హిందూ అభ్యర్థులు వీరే..

వివేక్ దేవీదాస్ థకారే (రావేర్), దత్తారావు భికాజీ దాండే (రిసోద్), డొంగరే కీర్తి దీపక్ (నాగ్ పూర్ దక్షిణం), అరుణ్ విఠల్ రావు బోర్డే (ఔరంగాబాద్ పశ్చిమం), ప్రహ్లాద్ ధోండీరామ్ రాథోడ్ (పైథన్), రత్నాకర్ దైనాను దవారే (కుర్లా), మనోజ్ సన్సరే (ధారవి), దనియాల్ లాండిగే (వడగావ్) సురేష్ ఏక్ నాథ్ జగ్ధనే (శ్రీరామ్ పూర్), బన్సొడే ఆతీష్ మోహన్ (షోలాపూర్ సిటీ నార్త్), అమిత్ కుమార్ సంజయ్ అజనల్కర్ (షోలాపూర్ సిటీ సౌత్), శంకర్ సర్గర్ (సంగోలా), సాగర్ నామ్ దేవ్ షిండే (హట్కనంగలే)లకు టికెట్లు ఇచ్చారు. మొత్తం సీట్లలో 30 శాతం హిందువులకు టికెట్లు ఇచ్చామని మజ్లిస్ నాయకులు వెల్లడించారు.

English summary
ముంబై: అఖిల భారత మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ.. తన వ్యూహాన్ని సమూలంగా మార్చేశారు. మజ్లిస్ అంటే ముస్లింల పార్టీ అనే ముద్రను చెరిపేసే ప్రయత్నంలో పడ్డారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రాబల్యాన్ని నిరూపించుకునే దిశగా సరికొత్త ఎత్తులను వేస్తున్నారు. ఇందులో భాగంగా- రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ ఏర్పాటు చేసిన పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా మజ్లిస్ తరఫున ఈ సారి ఏకంగా 30 శాతం మంది హిందూ అభ్యర్థులకు టికెట్లను ఇచ్చారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X