వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై ఎయిర్‌పోర్టులో విమానం బెల్లీ ల్యాండింగ్: రోగితోపాటు క్షేమంగా ప్రయాణికులు

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై ఎయిర్ పోర్టులో ఓ విమానం సాంకేతిక లోపం కారణంగా బెల్లీ ల్యాండింగ్ అయ్యింది. విమానంకు చెందిన ముందు టైర్ ఊడిపోయింది. అయితే, విమానం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ అందులోని ప్రయాణకులకు ఎలాంటి గాయాలూ కాలేదు. విమానం బెల్లీ ల్యాండ్ కారణంగా విమానాశ్రయంలో తాత్కాలిక ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది.

నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఈ సీ-90 వీటీ-జేఐఎల్ విమానం ముంబై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. ల్యాండింగ్ గేర్ ఉపయోగించకుండా పైలట్.. బెల్లీ ల్యాండింగ్ చేశాడని విమాన సిబ్బంది తెలిపారు. ల్యాండింగ్ గేర్ పనిచేయలేదని తెలిపారు. దీంతో విమానంకు చెందిన ముందు టైర్ ఊడిపోయి కొంత దూరంలో పడిపోయింది.

Air ambulance belly lands in Mumbai with patient onboard

కాగా, విమానంలో ఓ రోగి, అతని బంధువు, ఓ వైద్యుడు, ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారు. వీరంతా క్షేమంగా బయటపడ్డారు. ఘటన అనంతరం ఆ రోగిని ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు.

విమానం ముంబైలో ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండైన వెంటనే సీఐఎస్ఎఫ్, ఇతర సిబ్బంది విమానం వద్దకు వెళ్లి మంటలు రాకుండా నురుగనీరును పోశారు. విమానంలోని ప్రయాణికులను, సిబ్బందిని క్షేమంగా బయటికి తీసుకొచ్చారు.

Recommended Video

Coronavirus Update : Double Mutant పంజా.. Oxygen Shortage ఆక్సిజన్ అందక మృత్యువాత | Oneindia Telugu

English summary
A full state of emergency was declared at the Mumbai airport earlier on Thursday after an air ambulance suffered technical malfunction. The air ambulance, flying from Nagpur to Hyderabad, was diverted to Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X