వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో పొలాల్లో కూలిన ఎయిర్ అంబులెన్స్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ నగరంలో ఎయిర్ అంబులెన్స్ కు ప్రమాదం జరిగింది. బీహార్ లోని పాట్నా నుంచి ఢిల్లీ వెలుతున్న ఎయిర్ అంబులెన్స్ పొలాల్లో అత్యవసరంగా దిగడానికి ప్రయత్నించి కూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

Air Ambulance crash lands near Delhi Airport

ఎయిర్ బస్సులో మొత్తంలో ఏడు మంది ప్రయాణిస్తున్నారు. అందులో ఇద్దరికి గాయాలైనాయి. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయాలైన వారిని ప్రత్యేక అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Air Ambulance crash lands near Delhi Airport

అల్ కెమిస్ట్ పార్మా కంపెనీకి చెందిన సీ- 90 అనే విమానంలో పాట్నా నుంచి ఓ రోగిని తీసుకుని ఢిల్లీకి బయలుదేరారు. మార్గం మధ్యలో ఇంజన్లలో సాంకేతిక లోపం వచ్చింది. వెంటనే ఎయిర్ అంబులెన్స్ ను కిందకు దించడానికి పైలెట్ ప్రయత్నించారు.

Air Ambulance crash lands near Delhi Airport

ఢిల్లీలోని నజఫ్ గఢ్ ప్రాంతంలో పొలాల్లో దించేశారని, ఆ సందర్బంలో అది కూలిపోయినంత పని అయ్యిందని అధికారులు అన్నారు. అయితే ఈ ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని అధికారులు అంటున్నారు. పొలాల్లో ల్యాండ్ అయ్యిందా ? అది కుప్పకూలిపోయిందా ? అనే విషయం దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

English summary
The pilot decided to make an emergency landing after its engines shut down one after the other just as it was approaching the runway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X