వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాయుసేన అమ్ములపొదిలో స‌రికొత్త అస్త్రం: ఎలాంటి బంక‌ర్ల‌యినా క్ష‌ణాల్లో మ‌ఠాష్‌

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భార‌త వైమానిక దళం అమ్ములపొదిలో స‌రికొత్త అస్త్రం చేరుకోనుంది. అభివృద్ధి చేసిన స్పైస్‌-2000 బాంబుల‌ను పెద్ద ఎత్తున కొనుగోలు చేయాల‌ని అధికారులు నిర్ణ‌యించారు. దీనికోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి బంక‌ర్ల‌న‌యినా క్ష‌ణాల్లో విధ్వంసం చేయ‌గ‌ల సామ‌ర్థ్యం వాటికి ఉంది. వైమానిక ద‌ళంలో ఇదివ‌ర‌కే ఈ ర‌కం బాంబులు ఉన్నాయి. బంక‌ర్ల‌ను కుప్ప‌కూల్చ‌గ‌ల శ‌క్తి వాటికి లేదు. భూమికి రంధ్రాన్ని చేయ‌డం, జార విడిచిన‌ చోట పేలుళ్ల‌ను సృష్టించ‌గ‌ల స‌త్తా మాత్ర‌మే స్పైస్‌-2000 బాంబుల‌కు ఉంది.

దీనికి లెటెస్ట్ వ‌ర్ష‌న్‌గా త‌యారైన స్పైస్‌-2000 మార్క్ 84 ర‌కం బాంబుల‌ను కొనుగోలు చేయాల‌ని నిర్ణ‌యించింది. జ‌మ్మూకాశ్మీర్‌లో స‌రిహ‌ద్దులకు అవ‌త‌ల పాకిస్తాన్ భూభాగంపై ఉన్న బాలాకోట్‌పై వైమానిక దాడుల సంద‌ర్భంగా అభివృద్ధి చేసిన స్పైస్‌-2000 ర‌కం బాంబుల అవ‌స‌రం ఉంద‌ని అధికారులు గుర్తించారు. నిజానికి- బాలాకోట్‌పై దాడుల సంద‌ర్భంగా వింగ్ క‌మాండ‌ర్లు మిరాజ్‌-2000 యుద్ధ విమానాల నుంచి స్పైస్‌-2000 ర‌కం బాంబుల‌ను జార విడిచారు. ప‌డిన చోట మాత్ర‌మే పేలుళ్లు సృష్టించాయి. ఉపరిత‌లానికి మాత్ర‌మే అవి త‌మ స‌త్తా చాటాయి.

అదుపు త‌ప్పి..ర‌న్‌వేను దాటుకుని! విమానాశ్ర‌యంలో ప్ర‌మాదం అదుపు త‌ప్పి..ర‌న్‌వేను దాటుకుని! విమానాశ్ర‌యంలో ప్ర‌మాదం

Air Force looks at buying advanced bunker buster version of Spice-2000 bombs

ఉగ్ర‌వాదులు త‌ల‌దాచుకోవ‌డానికి నిర్మించుకున్న బంక‌ర్ల‌పై అవి ఆశించిన స్థాయిలో ప్ర‌భావాన్ని చూపలేక‌పోయాయని అధికారులు గుర్తించారు. దీనితో అభివృద్ధి చేసిన స్సైస్‌-2000 బాంబుల‌ను స‌మ‌కూర్చుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీనికోసం 300 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేయాల్సి రావ‌చ్చ‌ని అధికారులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు. త‌మ‌కు ఉన్న అత్య‌వ‌సర‌, విశేష అధికారాల‌ను ఉప‌యోగించి బంక‌ర్ల‌ను కుప్ప‌కూల్చ‌గ‌ల శ‌క్తిసామ‌ర్థ్యాలు ఉన్న ఈ ర‌కం బాంబుల‌ను కొనుగోలు చేయాల‌ని అధికారులు స‌న్నాహాలు చేస్తున్నారు. బంకర్లను మాత్రమే కాకుండా భారీ భవన సముదాయాలను కూడా నిమిషాల్లో సర్వనాశనం చేయగల సామర్థ్యం దీనికి ఉందని అధికారులు చెబుతున్నారు.

English summary
Buoyed by its success in the Balakot air strikes against a Jaish-e-Mohammed terrorist camp in Pakistan, the Indian Air Force is now planning to buy an advanced version of the Spice-2000 bomb, which can completely destroy buildings and bunkers. During the Balakot strikes, the Air Force had dropped Spice-2000 bombs from Mirage-2000 fighter aircraft after a pack of 12 of these fighters crossed the Line of Control to strike the Jaish facility in the Khyber Pakhtunwa province.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X