వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏఎన్‌-32 ఎయిర్‌క్రాఫ్ట్ ప్ర‌మాదంలో అమ‌రులైన జ‌వాన్లు వీరే..!

|
Google Oneindia TeluguNews

ఇటాన‌గ‌ర్‌: వైమానిక ద‌ళానికిక చెందిన ఏఎన్‌-32 విమానం గ‌ల్లంతైన ఘ‌ట‌న‌లో అందులో ప్ర‌యాణించిన వారిలో ఎవ‌రూ ప్రాణాల‌తో మిగ‌ల‌లేద‌ని వాయుసేన ప్ర‌క‌టించింది. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని పాయుమ్ వ‌ద్ద ద‌ట్ట‌మైన అర‌ణ్యం మ‌ధ్య ఏఎన్‌-32 విమాన శ‌క‌లాల‌ను గుర్తించిన వైమానిక ద‌ళ సిబ్బంది.. అందులో ప్ర‌యాణించిన వారి కోసం అన్వేషించారు. 48 గంట‌ల పాటు గాలించారు. అయిన‌ప్ప‌టికీ- ఆ 13 మందిలో ఎవ‌రి ఆచూకీ ల‌భించ‌లేదు. ఈ ప‌రిస్థితుల్లో వారంద‌రూ మ‌ర‌ణించి ఉంటార‌ని వైమానిక ద‌ళ అధికారులు నిర్ణ‌యించారు. ఇదే విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇదే విష‌యాన్ని వారి కుటుంబ స‌భ్యుల‌కు తెలియ‌జేశారు.

స్వరూపానంద అబద్దం చెప్పారా..? వివాదంలో జగన్ , కేసీఆర్ గురువు! <br>స్వరూపానంద అబద్దం చెప్పారా..? వివాదంలో జగన్ , కేసీఆర్ గురువు!

అమ‌ర జ‌వాన్లు వీరే..

ఏఎన్‌-32 విమానం ప్ర‌మాదానికి గురైన స‌మ‌యంలో అందులో మొత్తం 13 మంది ఉన్నారు. వింగ్ క‌మాండ‌ర్ జీఎం ఛార్లెస్‌, స్క్వాడ్ర‌న్ లీడ‌ర్ హెచ్ వినోద్‌, ఫ్లైట్ లెప్టినెంట్లు ఆర్ థాపా, ఎ త‌న్వ‌ర్‌, ఎస్ మొహంతి, ఎంకే గ‌ర్గ్‌, వారంట్ ఆఫీస‌ర్ కేకే మిశ్రా, సార్జంట్ అనూప్ కుమార్‌, కార్పొర‌ల్ షెరీన్‌, లీడ్ ఎయిర్‌క్రాఫ్ట్ అధికారులు ఎస్ కె సింగ్‌, పంక‌జ్‌, నాన్ కంబాటంట్ ఉద్యోగులు పుటాలీ, రాజేష్ కుమార్ ఉన్నారు. వారంద‌రూ క‌న్నుమూసిన‌ట్లు వైమానిక ద‌ళ అధికారులు తెలిపారు. ఈ స‌మాచారాన్ని వారి కుటుంబీకుల‌కు తెలియ‌జేశారు.

Air Force Says No Survivors From The Wreckage Of An-32 Jet That Crashed

ద‌ట్ట‌మైన అడ‌వుల మ‌ధ్య‌..

ఈ నెల 3వ తేదీన ఏఎన్‌-32 విమానం అదృశ్య‌మైన విష‌యం తెలిసిందే. అసోంలోని జోర్హాట్ నుంచి అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దుల్లోని మేఛుకా గ్రామంలో నిర్మించిన వైమానిక ద‌ళ బేస్‌క్యాంప్‌కు బ‌య‌లుదేరిన ఈ విమానంతో రాడార్ సంబంధాలు తెగిపోయాయి. ఆ వెంటనే విమానం ఆచూకీ కనుగొన‌డానికి భారీ ఆపరేషన్ చేప‌ట్టారు. దట్టమైన అడవి, ప్రతికూల వాతావరణం, చీకటి వల్ల ఏఎన్-32 విమానం ఆచూకీ కోసం హెలికాఫ్టర్లతో జ‌ల్లెడ ప‌ట్టారు. దీనికోసం ఇస్రో స‌హాయాన్ని తీసుకున్నారు. ఇస్రో ప్ర‌యోగించిన ఉప‌గ్ర‌హాల స‌హ‌కారంతో ద‌ట్ట‌మైన అరుణాచ‌ల్ అడ‌వుల్లో అణువ‌ణువూ గాలించారు. రాత్రి వేళ‌ల్లో స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయ గ‌ల స‌త్తా ఉన్న స్పై ఫ్ల‌యిట్ సీ-130జే విమానంతో గాలించారు. అయిన‌ప్ప‌టికీ.. దాని జాడ కాన‌రాలేదు. చివ‌రికి 11వ తేదీన సాయంత్రం శ‌క‌లాల‌ను గుర్తించారు.

English summary
There were "no survivors" from the An-32 aircraft that crashed in Arunachal Pradeshe earlier this month, the Indian Air Force (IAF) said today after searching the wreckage found earlier this week. Search teams "did not find any survivors," the Air Force said, adding that the families of the 13 personnel on board the aircraft had been informed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X