వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎఫ్ 16 ను ఖచ్చితంగా కూల్చివేశాం, ఇవిగో మరిన్ని ఆధారాలు , ఐఏఎఫ్

|
Google Oneindia TeluguNews

పాకిస్తాన్ కు చెందిన ఎఫ్ 16 యుద్ద విమానాన్ని కూల్చి వేసినట్టు నిరూపించే మరిన్ని ఆధారాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు విడుదల చేశారు. మిగ్ 21 ద్వార వింగ్ కమాండర్ అభినందన్ కూల్చిన విషయాన్ని రాడార్ ఇమేజ్ ద్వార వివరించారు.

ఎఫ్ 16 కూల్చివేత పై రాడార్ చిత్రాల విడుదల

ఎఫ్ 16 కూల్చివేత పై రాడార్ చిత్రాల విడుదల

పాకిస్తాన్ కు చెందిన ఎఫ్ 16 యుద్ద విమానం కూల్చారా లేదా అనే అనుమానాలకు మరిన్ని ఆధారాలను జోడించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ , గత రెండు రోజుల క్రితం అమేరికాకు చెందిన ఫారిన్ పాలసీ మ్యాగజైన్ , పాకిస్తాన్ లోని ఎఫ్ 16 యుద్ద విమానాలు అన్ని ఉన్నాయని ప్రకటించిన నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ ఫోర్ ఫిబ్రవరి 27న దాడి సంబంధించి రాడార్ ఇమేజ్ ను విడుదల చేసి,సంఘటన జరిగిన తీరును ఐఏఎఫ్ వైస్ మార్షల్ ఆర్జీకే కపూర్ పలు విషయాలను వివరించారు.

పాక్ లో ఎఫ్ 16 యుద్ద విమానాలు క్షేమం ; ఫారిన్ పాలసీ రిపోర్ట్

పాక్ లో ఎఫ్ 16 యుద్ద విమానాలు క్షేమం ; ఫారిన్ పాలసీ రిపోర్ట్

పుల్వామా దాడి తర్వాత భారత వైమానిక దళం చేపట్టిన ఆపరేషన్ లో పాకిస్తాన్ జెట్ ఫైటర్ ఎఫ్ _16 ను కూల్చబడలేదంటూ అమేరికాకు చెందిన ఫారిన్ పాలసీ మ్యాగజైన్ తన కథనంలో పేర్కోంది. ఇందుకోసం ఆమేరికా ఢిఫెన్స్ లో పనిచేసే ఓ ఇద్దరు అధికారులను పేర్కోంటూ , ఆ మ్యాగజైన్ కథనాన్ని వెలువరించింది. కాగా భారత వైమానిక అధికారులు చెప్పిన స్టేట్ మెంట్ కు విరుద్దంగా తన కథనంలో పేర్కోంది.. బాలకోట్ దాడి మరుసటి రోజు పాకిస్తాన్ కు పట్టుబడిన వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్తాన్ జెట్ ఫైటర్ ఎఫ్ 16 ను కూల్చివేశాడని భారత వైమానిక అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి క్షిపణి భాగాలను సైతం మీడియా ముందు కూడ ప్రదర్శించారు.

నేరుగా వెళ్లి పరీశీంచామని తేల్చిన యూఎస్ అధికారులు

నేరుగా వెళ్లి పరీశీంచామని తేల్చిన యూఎస్ అధికారులు

ఈనేపథ్యంలో బాలాకోట్ సంఘటన జరిగిన తర్వాత పాక్ లో ఎలాంటీ నష్టం జరగలేదని , తమ విమానాలు ఏవి కూల్చబడలేదని ప్రకటించింది, ఈనేపథ్యంలోనే ఆమేరికాను సైతం ఎఫ్ 16 పరిశీలించేందుకు రావాలని ఆహ్వనించిందని తెలిపింది. దీంతో ఇదే విషయాన్ని పేరు చెప్పడానికి ఇష్టపడని ఇద్దరు యూఎస్ ఢిఫెన్స్ అధికారులు వెలువరించారని పేర్కోంది.

జెట్ ఫైటర్ లను అందించిన అమేరికా కంపనీ

జెట్ ఫైటర్ లను అందించిన అమేరికా కంపనీ

కాగా పాకిస్తాన్ కు ఎఫ్ 16 జెట్ విమానాలను అమేరికాకు చెందిన లాక్‌హీడ్ మార్టీన్ అనే సంస్థ పంపిణి చేసింది.దీంతొ వాటిని లెక్కించేందుకు వెళ్లిన అధికారులు పాకిస్తాన్ కు తాము సప్లై చేసిన విమానాల్లో ఏవి మిస్ కాలేదని పేర్కోన్నారని తెలిపింది.

ఎఫ్ 16 పై ఎలక్ట్రానిక్ సిగ్నేచర్

ఎఫ్ 16 పై ఎలక్ట్రానిక్ సిగ్నేచర్


పాకిస్థాన్‌ ఎఫ్‌-16 యుద్ధ విమానాలను వాడకపోతే శకలం భారత భూభాగంలో ఎలా దొరికిందని కేంద్ర రక్షణ మంత్రి నిర్మాలా సీతారామన్ సైతం ప్రశ్నించారు.కాగా ఎఫ్ 16 పై ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఉంటుంది. మరోవైపు దీన్ని మీడియా సమావేశంలో త్రివిధ దళాధిపతుల సంయుక్త సమావేశంలో భారత్ లో దొరికిన శకలాలు చూపించారు కాగా మిగ్ 21 పైలట్ ఎఫ్ 16 యుద్ద విమానాన్ని కుప్పకూల్చారని తెలిపింది. కాగా దీనిపై కథణాన్ని వెలువరించిన ఫారిన్ పాలసీ రిపోర్ట్ లోని నిజానిజాల్ని పరిశీలించాలని ఆమే కోరారు.

English summary
Radar images of an air battle between Indian Air Force (IAF) pilot Abhinandan Varthaman and a Pakistani jet during a February dogfight were shown by the air force today
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X