వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైనిక వీరుడు అభినందన్ కథతో సినిమా.. ఆ పాత్రకు జాన్ అబ్రహమేనా?

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : తెలుగు, హిందీ. ఏ సినిమా రంగం చూసినా.. సమస్తం బయోపిక్ మయం. అవును, ఇది అక్షరాలా సత్యం. తెలుగులో ఇటీవల మహానటి సావిత్రి, ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ లు తెరకెక్కగా.. అటు బాలీవుడ్ లో మోడీ, రాహుల్ గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా సినిమాలు రానున్నాయి. అదే కోవలో రియల్ హీరో వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ కథతో సినిమా తెరకెక్కుతుండటం విశేషం.

బయోపిక్ వేళ.. జయహో అభి

బయోపిక్ వేళ.. జయహో అభి

ఎన్నికల వేళ రాజకీయ నేతల బయోపిక్ లు సందడి చేస్తున్నాయి. ఇటు తెలుగు నాట.. అటు బాలీవుడ్ బాట.. ఎక్కడచూసినా ఈ బయోపిక్ లే వెండితెరను ఏలుతున్నాయి. తాజాగా దాయాదితో యుద్ధమేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో.. పాకిస్తాన్ సైన్యం చెర నుంచి క్షేమంగా తిరిగొచ్చిన వీరుడు అభిమాన్ వర్ధమాన్ కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కనుంది. బయోపిక్ ట్రెండ్ నడుస్తున్న క్రమంలో ఇప్పుడు ఈ అంశం చర్చానీయాంశంగా మారింది. అభి జీవిత చరిత్రను వెండితెరపైకి ఎక్కించేందుకు బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం.

సైనికుడా.. ఓ సైనికుడా

సైనికుడా.. ఓ సైనికుడా

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ టెర్రరిస్టుల శిబిరాలపై విరుచుకుపడింది భారత సైన్యం. ఆ క్రమంలో మిగ్ విమానం పైలట్ గా పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లాడు అభిమాన్. అనుకోని రీతిలో మిగ్ ను టార్గెట్ చేశాయి పాక్ దళాలు. దీంతో ప్యారాచూట్ సాయంతో కిందకు దిగాడు అభి. ఆ క్రమంలో పాకిస్థాన్ సైన్యం చేతికి చిక్కినా అధైర్యపడలేదు. నిండైన ధీరత్వం కనబరిచి రియల్ హీరో అనిపించుకున్నాడు. యావత్ భారతదేశం అతడి రాక కోసం ఎదురుచూసింది.

భారత్ వ్యూహాలకు తలొగ్గిన పాకిస్థాన్.. అంతర్జాతీయ వత్తిడి మేరకు అభిని విడిచిపెట్టేందుకు అంగీకరించింది. అలా రెండు రోజుల తర్వాత స్వదేశానికి చేరుకున్నాడు అభి. ఆ వీర సైనికుడు జన్మభూమికి తిరిగి వస్తున్నాడని తెలిసి భారతీయులంతా ఉద్వేగానికి గురైన క్షణాలు ప్రతిఒక్కరికీ అనుభవమే. అలా ఆయన జీవిత చరిత్ర తెలుసుకోవాలనే ఆరాటం సహజమే. అందుకే ఆ వీర పరాక్రముడి గురించి సినిమా తీసేందుకు సిద్ధమవుతోంది బాలీవుడ్ ఫిలిం మేకర్స్ యూనిట్.

<strong>మంత్రివర్గ విస్తరణతో అసంతృప్తుల సెగ?.. తారక మంత్రం ఫలించేనా?</strong>మంత్రివర్గ విస్తరణతో అసంతృప్తుల సెగ?.. తారక మంత్రం ఫలించేనా?

ఏం టైటిల్ పెడతారో మరి..!

ఏం టైటిల్ పెడతారో మరి..!

అభినందన్ బయోపిక్ చిత్రానికి సంబంధించి ఇప్పటికే వివిధ టైటిల్స్ రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. అదలావుంటే అభినందన్ పాత్రకు ఎవరు సూట్ అవుతారనే చర్చ జోరుగా సాగుతోంది. ఆ క్రమంలో అభి పాత్ర పోషించడానికి మీరు రెడీయా అంటూ కొందరు మీడియా ప్రతినిధులు జాన్ అబ్రహంను ప్రశ్నించారు. దానికి స్పందించిన ఆయన.. ఛాన్స్ వస్తే కచ్చితంగా చేస్తానని చెప్పాడట. అభినందన్ రియల్ హీరో.. అతడి జీవితం స్ఫూర్తిదాయకమంటూ చెప్పుకొచ్చాడట. యురి దాడి ఘటన నేపథ్యంలో వచ్చిన చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో.. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన సర్జికల్ స్ట్రైక్ పై కూడా మరో చిత్రం తెరకెక్కించే ప్రయత్నాలు జరగుతున్నట్లు సమాచారం.

<strong>సప్పుడు లేదు, కాలుష్యం లేదు.. ఇవాళ్టి నుంచే కొత్త ఎలక్ట్రిక్ బస్సులు</strong>సప్పుడు లేదు, కాలుష్యం లేదు.. ఇవాళ్టి నుంచే కొత్త ఎలక్ట్రిక్ బస్సులు

English summary
Biopic Trend runs in Tollywood and Bollywood. Election time, Narendra modi and Rahul gandhi biopic's are on shoot. Mean while air force pilot abhinandan biopic also ready to shot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X