వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్మగ్లర్‌గా మారిన ఎయిర్‌హోస్టెస్..! బంగారం ఎందులో తెచ్చిందో తెలుసా...?

|
Google Oneindia TeluguNews

బంగారం స్మగ్లింగ్ అనేది ఓ సమస్యగా మారిపోయింది. ఇప్పటికే భారత్ ఆర్ధిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న సంధర్భంలో పన్నులు లేకుండా బంగారాన్ని విదేశాల నుండి తీసుకువచ్చే స్మగ్లర్లు రకరకాల రూపాల్లో బంగారాన్ని తీసుకువస్తున్నారు. విమానాశ్రాయాల్లో ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికి అధికారులకు దొరక కుండా వింత పద్దతుల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. దీంతో కొంతమంది బంగారాన్ని కరిగించి తెస్తుంటే మరోకరు శరీర భాగాల్లో దాచుకుని తెస్తున్నారు. ఇలా వింత వింత పరిస్థితుల్లో బంగారం తెస్తున్న స్మగ్లర్లు చివరకు పోలీసులు చేపడుతున్న ఆపరేషన్‌కు చిక్కుతున్నారు.

తాజాగా లక్షలు రుపాయాలు సంపాదించే ఎయిర్ హోస్టెస్‌ను కూడ స్మగ్లింగ్ ముఠాలు రంగంలోకి దింపాయి. విమానాలు, విమానాశ్రాయాల గురించి అడుగడుగునా తెలిసిన వారైతే ఎవ్వరికి అనుమానం రాదనే ఆలోచనతో స్మగ్లర్లు ఎయిర్ హోస్టెస్‌తో స్మగ్లింగ్ కొనసాగించారు. అది కూడ ఆమే "లో' దుస్తుల్లో బంగారాన్ని తరలిస్తు పట్టుపడింది. ఈనేపథ్యంలోనే దుబాయ్‌ నుండి ముంబాయికు సర్వీసు అందించే ఓ ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌లో యువతి ఎయిర్ హోస్టెస్‌గా విధులు నిర్వహిస్తోంది. ఆమేకు కొంతమంది బంగారం స్మగ్లింగ్ చేసే వ్యాపారులతో సంబంధాలు ఏర్పాడ్డాయి.

Air Hostess has become a smuggler

అటు ఉద్యోగం చేస్తూనే మరోవైపు స్మగ్లింగ్ వ్యాపారం చేపట్టింది. దీంతో ఇటివల దుబాయ్ నుండి ముంబాయి వచ్చిన విమానంలో ఆ ఎయిర్‌హోస్టెస్ సుమారు నాలుగు కిలోల బంగారాన్ని తీసుకువచ్చింది. ఈ బంగారాన్ని చిన్న చిన్న బిస్కెట్‌ రూపంలోకి మార్చుకుని తన బ్రాలో వేసుకుని తీసుకువచ్చింది. అయితే అధికారుల ముందస్తు సమాచారంతో ఎయిర్‌హోస్టెస్‌ను చెక్ చేశారు. స్కానింగ్ యంత్రాల ద్వార బంగారాన్ని గుర్తించారు. దీంతో ఎయిర్ హెస్టెస్‌తో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

English summary
Airhostess has become a smuggler who serving for private airlines. police caught her putting gold in her underwear
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X