వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వృద్దులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎయిరిండియా: 50 శాతం రాయితీ అందుకోండిలా..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశీయ విమానయాన దిగ్గజ సంస్థ ఎయిర్ ఇండియా వృద్ధ ప్రయాణికుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. 60 ఏళ్లకు పైబడిన వ్యక్తులకు తమ టికెట్ రుసుములో 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఇది కేవలం దేశీయ విమానాలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.

Recommended Video

Air India Offers 50% Discount On Airfare For Senior Citizens Flying On Domestic Routes

ఈ మేరకు ఎయిరిండియా తన వెబ్‌సైట్‌లో వివరాలను వెల్లడించింది. భారతీయులై ఉండి, భారతదేశంలో నివసిస్తున్న 60 ఏళ్లకు పైబడిన వారు ఈ ఆఫర్‌కు అర్హులని పేర్కొంది. ప్రయాణం చేసే నాటికి వారికి 60 ఏళ్లు ఉండాలని తెలిపింది. ఈ రాయితీ కేవలం టికెట్ రుసముపైనే కాకుండా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిలి ఏవియేషన్(డీజీసీఏ) ప్రకటించిన అన్ని రుసుములకూ కలిపే 50 శాతం రాయితీ అని తెలిపింది.

 Air India Announces 50 Percent Concession on Airfare for Senior Citizens

టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ప్రయాణికులు వారి గుర్తింపు కార్డును అనుసరించి వయసును నమోదు చేసుకోవాలని సూచించింది. వీటిలో ఓటరు గుర్తింపు కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఎయిరిండియా జారీ చేసిన సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డులు అనుమతిస్తామని పేర్కొంది.

ప్రయాణికులు ఈ రాయితీని ఉపయోగించుకుని దేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్లొచ్చని తెలిపింది. అయితే, మూడు రోజుల ముందుగా టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. కాగా, తనిఖీ సమయంలో సరైన గుర్తింపు కార్డులు సమర్పించకపోతే టికెట్ పూర్తి రుసుమును చెల్లించాల్సి ఉంటుందని ఎయిరిండియా స్పష్టం చేసింది.

English summary
Air India has launched a scheme for senior citizens where they can book tickets at a 50 per cent concession on the base fare. This scheme is only applicable to domestic flights and only fliers above the age of 60 are eligible.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X