వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమాన టికెట్లపై మోడీ ఫొటో దుమారం, వెనక్కి తీసుకుంటామని ప్రకటించిన ఎయిరిండియా

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : ఎయిర్ ఇండియా టికెట్లపై ప్రధాని నరేంద్రమోడీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఫొటోల ముద్రణ వివాదాస్పదంగా మారింది. వైబ్రంట్ గుజరాత్ 2019 అడ్వర్టైజ్‌మెంట్‌ ఉన్న టికెట్లును సంస్థ జారీ చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ అంశంపై దుమారం రేగడంతో ఎయిరిండియా వెనక్కితగ్గింది.

ఓటర్లే టార్గెట్‌గా 87వేల వాట్సప్ గ్రూపులు.. ప్రచారంలో టెక్నాలజీని వాడుకుంటున్న నేతలుఓటర్లే టార్గెట్‌గా 87వేల వాట్సప్ గ్రూపులు.. ప్రచారంలో టెక్నాలజీని వాడుకుంటున్న నేతలు

కొత్త టికెట్లు జారీ చేస్తామన్న ఎయిరిండియా
టికెట్లపై మోడీ, విజయ్ రూపానీ ఫొటో ముద్రించడంపై దుమారం రేగడంతో ఎయిర్ ఇండియా స్పందించింది. అది థర్డ్ పార్టీ అడ్వర్టైజ్‌మెంట్ అని స్పష్టం చేసింది. కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఫిర్యాదులు అందినందున వెంటనే ఆ టికెట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పింది. మోడీ ఫోటో ఉన్న టికెట్ల స్థానంలో కొత్తవి జారీచేయనున్నట్లు ప్రకటించింది.

Air India boarding pass with PM Modi’s photo kicks up row, airline withdraws it

జనవరిలో వైబ్రంట్ గుజరాత్ సదస్సు
వివాదానికి కారణమైన ఎయిరిండియా టికెట్లపై వైబ్రంట్ గుజరాత్ 2019 అడ్వర్జయిజ్‌మెంట్ ముద్రించి ఉంది. వాస్తవానికి జనవరిలో ఈ సదస్సు జరిగింది. ఆ సమయంలో ప్రింట్ చేసిన టికెట్లపై మాత్రమే మోడీ, విజయ్ రూపానీల ఫోటోలతో కూడిన యాడ్ ఉందని ఎయిరిండియా చెబుతోంది. అప్పట్లో బుక్ చేసుకున్న వారి వద్ద మాత్రమే బీజేపీ యాడ్ ఉన్న టికెట్లు ఉన్నట్లు స్పష్టం చేసింది. థర్డ్ పార్టీ అడ్వర్టయిజ్‌మెంట్లతో తమకు సంబంధం లేకపోయినప్పటికీ వివాదానికి కారణమైనందున వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు.

English summary
Air India has decided to “roll back” its boarding passes bearing photographs of Prime Minister Narendra Modi and Gujarat Chief Minister Vijay Rupani after they came in for criticism.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X