వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రమాదానికి ముందు కోజికోడ్ ఎయిర్‌పోర్టు చుట్టూ చక్కర్లు కొట్టిన ఎయిరిండియా విమానం

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: 191 మంది ప్రయాణికులు, సిబ్బందితో కోజికోడ్ విమానాశ్రయం చేరుకున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ల్యాండింగ్ అవుతుండగా క్రాస్ అయ్యింది. దీంతో విమానం రెండు ముక్కలైంది. రన్ వేకు కొన్ని అడుగుదూరంలో విమాన ముక్కలు పడిపోయాయి.

కోజికోడ్ విమానాశ్రయం: ఎయిరిండియా విమానం క్రాష్, పైలట్ సహా 14 మంది మృతి, పలువురికి గాయాలుకోజికోడ్ విమానాశ్రయం: ఎయిరిండియా విమానం క్రాష్, పైలట్ సహా 14 మంది మృతి, పలువురికి గాయాలు

ఎయిరిండియా లిమిటెడ్‌కు చెందిన బోయింగ్ విమానం కో 737 విమానం దుబాయ్ నుంచి కోజికోడ్ వచ్చిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆఫ్ ఇండియా హెడ్ అరుణ్ కుమార్ తెలిపారు. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్ రాడర్ 24 ప్రకారం.. కోజికోడ్ విమానాశ్రయంలో ఎయిరిండియా విమానం ల్యాండ్ అయ్యే ముందు పలుమార్లు ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది.

విమానాశ్రయం రన్ వేపై భారీగా వర్షపు నీరు చేరుకోవడం, సరైన విజిబులిటీ లేకపోవడం కారణంగానే విమానం క్రాష్ అయ్యిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 14 మంది మరణించగా, 45 మంది తీవ్రగాయాలపాలయ్యారు.

 Air India Express Plane Circled Kerala Airport Several Times Before Crash

ఇది ఇలావుండగా, 2010లో భారతదేశంలో పెద్ద విమాన ప్రమాదం సంభవించింది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ బోయింగ్ కో విమానం రన్ వేపై క్రాష్ కావడంతో భారీగా మంటలు ఎగిశాయి. ఈ ప్రమాదంలో మొత్తం 158 మంది మరణించారు. భారతదేశంలో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదం ఇదే కావడం గమనార్హం.

Recommended Video

Kozhikode : కేరళలో ఘోర ప్రమాదం.. ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ కీలక ఆదేశాలు ! || Oneindia

తాజా విమాన ప్రమాదం: హెల్ప్‌లైన్ నెంబర్లు..:

విమానంలో వర్షపు నీరు చేరుకున్న కారణంగా సరిగా రన్ వే కనిపించకపోవడంతో ఎయిరిండియా విమానం క్రాష్ అయ్యిందని, ఆ తర్వాత రెండుగా ముక్కలైందని ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) వెల్లడించింది. విమానంలో 191 మంది ఉన్నారని తెలిపింది. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా రన్ వేపై నీరు చేరడంతో విమానం స్కిడ్ అయినట్లు తెలుస్తోంది.

ప్రమాద సమయంలో 174 మంది ప్రయాణికులు, 10 మంది చిన్నారులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. బోయింగ్ విమాన ప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కోజికోడ్ విమాన ప్రమాదం : హెల్ప్ లైన్ నెంబర్లు విడుదల 0543090572, 543090575, 0565463903, 0543090572

English summary
an Air India Express plane with 191 passengers and crew aboard overshot the runway attempting to land at Kerala's Kozhikode airport, breaking in two and coming to rest in a nearby valley.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X