Air Crashes: ప్రపంచంలో హడలు పుట్టించిన 10 విమాన ప్రమాదాలు ఇవే, గాల్లోనే ప్రాణాలు!
న్యూఢిల్లీ/ తిరువనంతపురం/ బెంగళూరు: కేరళలోని కోజికోడ్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఇప్పటి వరకు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 100 మంది ప్రయాణికులు, విమాన సిబ్బందికి గాయాలైనాయని అధికారులు అంటున్నారు. దుబాయ్ నుంచి కోజికోడ్ కు శుక్రవారం రాత్రి ఎయిర్ ఇండియాకు చెందిన DXB-CCJ బోయింగ్ 737 IX 1344 విమానం వచ్చింది. ఎయిర్ ఇండియా విమానం రన్ వే పై నుంచి జారిపోవడంతో రెండు ముక్కలై 19 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కోజికోడ్ విమాన ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్, ప్రధాని నరేంద్ర మోడీ. ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, రాహుల్ గాంధీ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఇప్పటి వరకు చాలా విమాన ప్రమాదాలు జరిగాయి. వాటిలో ప్రపంచాన్ని హడలు పుట్టించిన 10 విమాన ప్రమాదాల్లో అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
Gold smuggling: నేను ముద్దమందారం, ముట్టుకుంటే, రూ. 100 కోట్ల స్కామ్, నో బెయిల్, ఈడీ కస్టడీ !

బజ్పే విమానాశ్రయంలో 160 మంది
కర్ణాటకలోని మంగళూరులో 2010 మే 22వ తేదీ శనివారం 6.30 గంటల సమయంలో దుబాయ్ నుంచి బజ్పే అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకన్న బోయింగ్ 737 విమానం రన్ వే మీద ల్యాండ్ అవుతున్న సమయంలో జారిపోయి భూమిని ఢీకొనడంతో 160 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ప్రమాదంలో నాలుగు పశువులు కూడా ఖాళీ బూడిద అయ్యాయి. మంగళూరులోని బజ్పే అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాదవశాత్తు విమానం జారిపోయి రన్ వేను దాటిపోయి భూమిని బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 165 మంది ప్రయాణికులు ఉన్నారు.

కాఠ్మండు విమానం
ప్రయాణికులు స్వర్గంగా భావించే నేపాల్ లో 2012 సెప్టెంబర్ 28వ తేదీన ఉదయం 6. 30 గంటల సమయంలో సీతా ఎయిర్ లైన్స్ జెట్ విమానం శిఖరాలు (కొండలు)ను ఢీకొనడంతో 19 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సీతా ఎయిర్ లైన్స్ జెట్ విమానం కాఠ్మండ్ విమానాశ్రయం నుంచి మౌంట్ ఎవరెస్టు శిఖరాలను వీక్షించడానికి ప్రయాణికులు బయలుదేరిన కొన్ని నిమిషాల్లోనే లుక్లాదత్త (Lukla) సమీపంలోని మనోహర నదీ తీరంలో కొండలను ఢీకొనడంతో విమానం గాలిలోనే ఖాళీ బూడిద అయ్యింది. ఈ ప్రమాదంలో ఇటలికి చెందిన 16 మంది పర్యాటకులు, ముగ్గురు విమాన సిబ్బంది ప్రాణాలు పోయాయి.

సముద్రంలో దూకిన విమానం
2013 ఏప్రిల్ 13వ తేదీన బండుగ్ నుంచి 100 మంది ప్రయాణికులతో ఇండోనేషియాలోని ద్వీపకల్పం బాలికి లయన్ ఎయిర్ క్రాఫ్ట్ విమానం బయలుదేరింది. ఆ సమయంలో బాలి విమానాశ్రయంలోని రన్ వేలో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ పోర్టు సిబ్బంది కష్టపడి ప్రయాణికులు అందర్నీ ప్రాణాలతో కాపాడారు.

తైవాన్ లో 50 మంది ఔట్
2014 జులై 23వ తేదీ బుధవారం సాయంత్రం తైవాన్ రాజధాని నుంచి ఫెంఘు అనే చిన్న ద్వీపానికి 56 మంది ప్రయాణికులతో ట్రాన్స్ ఏషియా విమానం బయలుదేరింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో మొదట ల్యాండ్ చెయ్యడానికి ప్రయత్నించారు. అయితే వీలుకాకపోవడంతో తైవాన్ లోని మగాంగ్ ఎయిర్ పోర్టులో రెండోసారి విమానం ల్యాండ్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్న సమమంలో విమానం కుప్పకూలిపోవడంతో 50 మంది ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

6 వేల అడుగుల ఎత్తులో 148 మంది
2015 మార్చి 24వ తేదీన దక్షిణ ఫ్రాన్స్ లోని బార్సిలోనా నుంచి డెస్సల్ డోప్ ప్రాంతానికి 148 మంది ప్రయాణికులతో జర్మన్ వింగ్ ఎయిర్ లైన్స్ విమానం బయలుదేరింది. 6 వేల అడుగుల ఎత్తులో విమానం వెలుతున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఆ సమయంలో విమానం కుప్పకూలిపోవడంతో విమాన సిబ్బందితో సహ ప్రయాణికులు అందరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ప్రమాదంలో ఒక్క ప్రయాణికుడిని కాపాడటానికి సాధ్యం కాలేదని అప్పటి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోల్లాడ్ అప్పట్లో విచారం వ్యక్తం చేశారు.

ఇరాన్ విమానం
2018 ఫిబ్రవరి 18వ తేదీన ఇరాన్ లోని తెహరాన్ నుంచి ఇస్ ఫాహాన్ ప్రాంతానికి ఓ విమానం బయలుదేరింది. గాలిలో వెలుతున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం సెమిరాయ్ నగరం సమీపంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 66 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

టేకాఫ్ టైంలో బిల్డింగ్ కు విమానం ఢీ
2019 డిసెంబర్ 27వ తేదీన కజకిస్థాన్ లోని అల్మాటి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 100 మంది ప్రయాణికులతో బేక్ ఎయిర్ లైన్స్ విమానం బయలుదేరింది. ఎయిర్ పోర్టులో విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అదుపుతప్పి సమీపంలోని రెండు అంతస్తుల భవనాన్ని ఢీకొనింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రయాణికుల ప్రాణాలు పోయాయని అప్పట్లో అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎంత మంది ప్రాణాలు పోయాయి అనే విషయంలో ఇంత వరకు క్లారిటీ లేదు అనే ఆరోపణలు ఉన్నాయి.

తాలిబన్ ప్రాంతంలో 88 మంది
2020 జనవరి 27వ తేదీన స్థానిక కాలమానం ప్రకారం మద్యాహ్నం 1.10 గంటల సమయంలో అఫ్గానిస్తాన్ నుంచి ఆరియాన ఎయిర్ లైన్స్ విమానం 83 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఘజని నగరం సమీపంలోని గవర్నర్ కార్యాలయం సమీపంలో విమానం వెలుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. విమానం కూలిన ప్రాంతం తాలిబన్లు ప్రాంతంలో ఉందని గవర్నర్ కార్యాలయం అధికార ప్రతినిధి ఆరీఫ్ నూరి అప్పట్లో చెప్పారు.

ఎవరెస్టులో ఎగిరింది... అంతే
2019 ఏప్రిల్ 14వ తేదీన సెమ్మిట్ ఎయిర్ లైన్స్ (గోమా ఎయిర్)కు చెందిన విమానం నేపాల్ లోని తెన్జింగ్ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. నేపాల్ లోని సోలో కంబు ప్రాంతంలో విమానం వెలుతున్న సమయంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో కో పైలెట్ తో సహ ముగ్గురు మరణించారు.

స్వీడన్ లో జస్ట్ మిస్
2018 నవంబర్ 29వ తేదీన ఎయిర్ ఇండియా విమానం స్వీడన్ రాజధాని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో విమానం రెక్కలు ఓ భవాన్ని ఢీకొన్నాయి. ఆ సమయంలో విమానంలో 179 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగలేదు.