• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎయిర్ లిఫ్ట్: గల్ఫ్‌లో నరకాన్ని చవి చూస్తోన్న భారత కార్మికులకు కేంద్రం శుభవార్త: 10 లక్షల మంది..!

|

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో గల్ఫ్ నుంచి స్వదేశానికి రాలేక తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటోన్న భారత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలియజేసింది. జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి.. లాక్‌డౌన్ వల్ల ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తోన్న భారత కార్మికులను స్వదేశానికి తీసుకుని రావడానికి ఏర్పాట్లను చేస్తోంది. దీనికోసం ఎయిరిండియా విమానాలను, నౌకాదళాన్ని సిద్ధం చేసింది.

విదేశాంగ శాఖ అనుమతులు లభించిన వెంటనే..

విదేశాంగ శాఖ అనుమతులు లభించిన వెంటనే..

విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు లభించిన వెంటనే ఎయిరిండియా విమానాలను గల్ప్ దేశాలకు పంపంచడానికి ఏర్పాట్లను పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. సుమారు 10 లక్షల మంది భారత కార్మికులు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్, కువైట్, ఖతర్, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నట్లు ఓ అంచనాకు వచ్చామని చెప్పారు. వారందరినీ దశలవారీగా స్వదేశానికి చేరుస్తామని అన్నారు.

లాక్‌డౌన్ వల్ల ఉపాధిని కోల్పోయి..

లాక్‌డౌన్ వల్ల ఉపాధిని కోల్పోయి..

కరోనా వైరస్ ప్రబలిపోయిన నేపథ్యంలో గల్ఫ్ దేశాలు కూడా లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. ఫలితంగా- అక్కడి మౌలిక రంగం స్తంభించిపోయింది. నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోయాయి. చమురు వెలికి తీత నామమాత్రంగా కొనసాగుతోంది. పరిమిత సంఖ్యలోఅనే అక్కడ కార్మికులు పని చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మనదేశంతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక వంటి భారత ఉపఖండం నుంచి అక్కడికి వెళ్లిన కార్మికులంతా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇరుకిరుకు గదుల్లో నివసిస్తూ ప్రత్యక్ష నరకాన్ని చవి చూస్తున్నారు.

 వలస శిబిరాల్లో.. ప్రత్యక్ష నరకం..

వలస శిబిరాల్లో.. ప్రత్యక్ష నరకం..

సోషల్ డిస్టెన్సింగ్‌తోనే కరోనా వైరస్‌ను ఎదుర్కొనాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వారు కనీసం జాగ్రత్తలనైనా పాటించలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారు. దీనిపై కేరళ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారత కార్మికులను స్వదేశానికి రప్పించడానికి తక్షణ చర్యలను చేపట్టాలని విజ్ఙప్తి చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

 రాష్ట్రాల నుంచి నివేదికలు..

రాష్ట్రాల నుంచి నివేదికలు..

రాష్ట్రాల నుంచి కూడా జాబితాను తెప్పించుకునే పనిలో పడింది కేంద్ర ప్రభుత్వం. ఏఏ రాష్ట్రం నుంచి ఎంతమంది గల్ఫ్ దేశాలకు వెళ్లారనే విషయంపై పూర్తి సమాచారంతో కూడిన నివేదికను అందజేయాలని కేంద్రం ఇదివరకే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలను జారీ చేసింది. దీనికి సంబంధించిన నివేదికలను తెప్పించుకుంటోంది. కేరళ ప్రభుత్వం ఇప్పటికే పూర్తి వివరాలను కేంద్రానికి పంపించినట్లు తెలుస్తోంది.

  #IranvsUSA : US Aircraft Restricted From Flying Over Iraq, Iran, Arabian Gulf || Oneindia Telugu
  సముద్ర మార్గం గుండా స్వదేశానికి..

  సముద్ర మార్గం గుండా స్వదేశానికి..

  గల్ఫ్ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల నుంచి భారత కార్మికుల వివరాలను తెప్పించుకుంది. సుమారు 10 లక్షల మంది వరకు అక్కడ తలదాచుకుంటున్నట్లు గుర్తించింది. వారందర్నీ దశలవారీగా స్వదేశానికి రప్పించడానికి ఎయిరిండియా విమానాలను పంపించబోతోంది. అలాగే- భారత కార్మికుల సంఖ్య లక్షల్లో ఉండటం వల్ల నౌకాదళ సహాయాన్ని కూడా తీసుకోనుంది. గల్ఫ్ దేశాల్లో తీర ప్రాంత నగరాల్లో నివసించే భారత కార్మికులను సముద్రమార్గం గుండా తీసుకుని రావడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులను సూచించినట్లు చెబుతున్నారు.

  English summary
  The national carrier Air India and Indian Navy have been asked to be on standby with their aircraft and warships for the mass evacuation of Indians from Gulf countries as Covid-19 pandemic continues. "We are assessing the scenario and finding the plan to evacuate Indians from the Gulf countries. We have asked Air India and Indian Navy for the detailed evacuation plan," top government sources told.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more