వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుబాయ్ నుంచి కొచ్చికి ఎయిర్ ఇండియా డైలీ ప్లైట్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దుబాయ్ నుంచి కేరళ రాజధాని కొచ్చికి ప్రతి రోజూ విమాన సర్వీసుని నడపనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. దుబాయ్‌లో నివసిస్తున్న భారతీయులు కోరిక మేరకు జనవరి 11 నుంచి డైలీ విమానాన్ని నడపడానికి నిర్ణయించినట్లు ఎయిర్ ఇండియా గల్ఫ్‌- రీజియన్‌ మేనేజర్‌ మెల్విన్‌ డిసిల్వా వెల్లడించారు.

షార్జా-కొచ్చి-షార్జా సర్వీసుకు 180 సీట్లు ఉన్న ఏ320 ఎయిర్ క్రాప్ట్‌ను ఉపయోగించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సర్వీసు ప్రారంభం సందర్భంగా ఎయిర్‌ఇండియా ప్రమోషనల్‌ ఆఫర్స్‌ ఇస్తోంది. ఎయిర్ ఇండియా ప్రతి వారం అబుదాబి, దుబాయి, షార్జా అంతర్జాతీయ విమానాశ్రయాలకు 74 విమానాలను నడుపుతోంది.

Air India to introduce daily Dubai-Kochi flight

దుబాయ్ నుంచి 1330 గంటలకు బయల్దేరిన AI-934 విమానం కొచ్చి విమానాశ్రయానికి 1910 (స్ధానిక కాలమానం ప్రకారం)కు చేరుకుంటుంది. అదే విధంగా AI-933 విమానం కొచ్చి విమానాశ్రయం నుంచి 0935 గంటలకు బయల్దేరి దుబాయ్ విమానాశ్రయానికి 1235కు చేరుకుంటుంది.

ఈ సర్వీసులో వన్‌వేకు 330 అరబ్‌ ఎమిరేట్స్‌ దిర్హామ్‌లు (సుమారు రూ.6వేలు), వెళ్లి రావడానికి 785 అరబ్‌ ఎమిరేట్స్‌ దిర్హామ్‌లు (సుమారు రూ.14,268)గా నిర్ణయించింది. అదే విధంగా 30 కేజీల ఉచిత లగేజీ అలవెన్స్‌‌ను ఎయిర్ ఇండియా ఇస్తోంది.

English summary
Air India will introduce daily flight services from Dubai to Kochi from January 11, adhering the long-pending demand of Indians living here, the company has announced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X