వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెలగాటం: మందు కొట్టి విమానాలు నడిపిన పైలెట్లు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మద్యం సేవించి విదేశాల నుంచి భారత్ కు విమానాలు నడిపిన ఇద్దరు పైలెట్లను నాలుగు సంవత్సరాలు సస్పెండ్ చేశారు. ఈ ఇద్దరు విమానాలు నడపడానికి అనర్హులని డీజీసీఏ నిర్ణయించింది.

రెండు విమానాలు విదేశాల నుంచి భారత్ వచ్చాయి. విమానంలో ఉన్న ప్రయాణికుల జీవితాలతో చెలగాటం ఆడిన పైలెట్లకు తగిన బుద్ది చెప్పారు. పరిస్థితి తీవ్రమైనదని, ఇద్దరు పైలెట్ల మీద ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యాలని ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్ వేస్ సంస్థలకు డీజీఏసీ సూచించింది.

ఈనెల 10వ తేదీన షార్జా నుంచి కాలికట్ కు ఎయిర్ ఇండియా విమానం వచ్చింది. పైలెట్ విమానం దిగిన తరువాత పరిక్షలు చేస్తే మోతాదుకు మించి ఆల్కాహాల్ తీసుకున్నారని వెలుగు చూసింది.

Air India, Jet Airways Pilots suspended for being drunk

అదే విధంగా ఈ నెల మూడో తేదీన అబుదాబి నుంచి చెన్నైకి జెట్ ఎయిర్ వేస్ విమానం వచ్చింది. ఆ విమానం నడిపిన పైలెట్ మోతాదుకు మంచి ఆల్కాహాల్ తీసుకున్నాడని వెలుగు చూసింది. వీరిద్దరు వదిలిన గాలిలో ఈ ఆల్కాహాల్ పాజిటివ్ అని వచ్చింది.

వెంటనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ ఇండియా విమానం పైలెట్ ను గ్రౌండింగ్ చేయగానే విమానం నడిపేందుకు తగినంత సిబ్బంది లేక ఇబ్బంది పడ్డారు. తరువాత కోజికోడ్ నుంచి వేరే విమానంలో ప్రయాణికులను గమ్యస్థానానికి పంపించారు.

జెట్ ఎయిర్ వేస్ విమానాన్ని మందు కొట్టి నడిపిన పైలెట్లను ఉద్యోగం నుంచి తొలగించారు. విదేశాల నుంచి వందలాధి మంది ప్రయాణికులు భారత్ కు వస్తున్న సందర్బంలో మద్యం సేవించి విమానం నడిపిన ఇద్దరు పైలెట్లను నాలుగు సంవత్సరాలు, కేబిన్ క్యూ సిబ్బంది ఒకరిని ఒక సంవత్సరం సస్పెండ్ చేస్తూ డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది.

English summary
Considering the seriousness of the violations, the aviation regulator has written to the chiefs of Jet Airways and Air India to register FIRs against the pilots concerned, sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X