వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అచ్చం మంగళూరు ప్రమాదం లాగే.. 2010లో ఎయిర్ ఇండియా ప్లైట్ క్రాష్, 158 మంది మృతి..

|
Google Oneindia TeluguNews

కోజికోడ్ విమానాశ్రయంలో రన్ వే పై జరిగిన విమాన ప్రమాదం కలిచివేస్తోంది. పైలట్, కో పైలట్ సహా 19 మంది చనిపోయారు. అయితే విమాన ప్రమాదానికి సరిగ్గా పదేళ్ల క్రితం జరిగిన మంగళూరు విమాన ప్రమాదంతో పోలిక ఉన్నాయి. అయితే ఈ రెండు విమానాశ్రయాలు కూడా టేబుల్ టాప్ రన్ వేలు కావడం విశేషం. కానీ ఆనాటి ప్రమాదంలో 158 మంది చనిపోయారు. ఎయిర్ ఇండియా ఇండియా చరిత్రలోనే అదీ తొలి పెద్ద ప్రమాదం.. అయితే అప్పట్లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండగా.. పైలట్ చేసిన తప్పిదం వల్లే ఘోర ప్రమాదం జరిగింది.

Recommended Video

Kozhikode 2020 VS Mangalore 2010 : సరిగ్గా పదేళ్ల క్రితం కూడా ఇలాంటి ప్రమాదమే ! || Oneindia Telugu
దుబాయ్ నుంచే.. సేమ్ ప్లైట్స్..

దుబాయ్ నుంచే.. సేమ్ ప్లైట్స్..


దేశంలో టేబుల్ టాప్ రన్ వేలు మూడు ఉన్నాయి. అందులో కేరళలోని కోజికోడ్, కర్ణాటకలోని మంగళూరు, మిజోరంలోని లెంగ్ వ్యూ విమానాశ్రయాలు ఉన్నాయి. నిన్న కోజికోడ్‌లో ఎయిర్ ఇండియా విమానం రన్ వే పై రెండు ముక్కలైన సంగతి తెలిసిందే. దీంతో గత ప్రమాదాన్ని గుర్తుకొస్తుంది. అయితే రెండు ఘటనలకు పలు పోలికలు ఉన్నాయి. రెండు టేబుల్ టాప్ రన్ వే, రెండు ఎయిర్ ఇండియా విమానాలు, రెండు బోయింగ్ 737 ప్లైట్లు.. అంతేకాదు రెండు వచ్చింది కూడా దుబాయ్ నుంచే కావడం విశేషం.

158 మంది మృతి..

158 మంది మృతి..

దుబాయ్‌ నుంచి 2010 మే 22న ఎయిర్‌ ఎక్స్‌ప్రెస్‌ విమానం ఉదయం 6 గంటల సమయంలో మంగళూరు విమానాశ్రయంలో దిగడానికి ప్రయత్నిస్తోంది. విమానాన్ని దించాలా వద్దా అనే సందిగ్ధంలో పైలట్‌ ఉండగా వద్దు వెనక్కి వెళదాం అని కో-పైలట్‌ మూడు సార్లు పైలట్‌కు చెప్పారు. ఆ లోపే విమానం రన్‌వేను దాటి కొండవారగా పడటంతో మంటలు చెలరేగాయి. పైలట్‌, కోపైలట్‌, సిబ్బంది సహా 158 మంది చనిపోయారు. ఎనిమిది మంది మాత్రమే బతికారు. అయితే విమానాన్ని దించడంలో పైలట్‌ చేసిన తప్పిదమే ఘోరానికి ప్రమాదానికి కారణమని దర్యాప్తులో చివరికి తేలింది.

అనుభవుజ్ఞుడే.. కానీ.. అనుకూలించని వాతావరణం

అనుభవుజ్ఞుడే.. కానీ.. అనుకూలించని వాతావరణం

నిన్నటి ప్రమాదంలో పైలట్ దీపక్ వసంత్ సాతే చాకచక్యంగా వ్యవహరించారు. అతను ఇదివరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో కూడా పనిచేశారు. మంచి అనుభవం ఉన్న ఫైలట్.. కానీ వాతావరణం అనుకూలించలేదు. దీంతో విమానం ల్యాండ్ చేసే ప్రయత్నం చేయగా.. రన్ వేపై నీరు నిలిచి ఉంది. దానిని అంచనా వేయడంలో విఫలం కావడంతో... విమానం రెండు ముక్కలుగా విరిగిపోయింది.

English summary
similar to the crash that took place in Mangaluru on May 22, 2010, where Air India Express Flight 812, a Boeing 737-800, skid off the runway, killing 158 people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X