వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ గగనతలం మూసివేయడంతో ఎయిరిండియాకు భారీ నష్టం..ఎంతో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బాలాకోట్ దాడుల తర్వాత పాక్‌ గగనతలంను మూసివేయడంతో భారత ప్రభుత్వ రంగ విమానాయాన సంస్థ ఎయిరిండియాకు భారీ నష్టాలు వచ్చాయి. జూలై 2వ తేదీ వరకు ఎయిరిండియాకు వచ్చిన నష్టం అక్షరాల రూ.491 కోట్లు అని పౌరవిమానాయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ రాజ్యసభలో తెలిపారు. ఇక ప్రైవేట్ సంస్థలు అయిన స్పైస్ జెట్, ఇండిగో, గోఎయిర్ సంస్థలకు వరుసగా రూ.30.73 కోట్లు, రూ.25.1 కోటి, రూ. 2.1 కోటి నష్టం వాటిల్లినట్లు ఆయన బుధవారం సభకు వివరించారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బాలాకోట్‌లో మెరుపుదాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి పాకిస్తాన్ తన గగనతలంను మూసివేస్తూ భారత విమానాలపై ఆంక్షలు విధించింది. ఇదిలా ఉంటే మొదట్లో భారత గగనతలంను మూసివేస్తున్నట్లు మన ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మే 30న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటన చేసింది. అయితే పాకిస్తాన్ తన గగనతలంపై ఆంక్షలు విధించడం తన ఏకపక్షధోరణిని తెలియజేస్తోందని అయినప్పటికీ ఆదేశ ప్రభుత్వం విజ్ఞతకే ఈ అంశాన్ని వదిలివేస్తున్నామని మంత్రి సభకు తెలిపారు.

air india losses
ఇక పాక్ తన గగనతలంను మూసివేయడంతో ఎయిరిండియా విమానం ప్రత్యామ్నాయ రూట్లు తీసుకోవాల్సి వచ్చిందని హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు. అంతేకాదు కొన్ని సమయాల్లో పలు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేయాల్సి రావడంతో భారీ నష్టం తప్పలేదని చెప్పారు. ముఖ్యంగా భారత్ నుంచి ఐరోపా, అమెరికాలోని నగరాలకు వెళ్లే విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఇక ఢిల్లీ నుంచి ఇస్తాంబుల్‌కు వెళ్లే ఇండిగో విమానం కూడా పాక్ గగనతలంలోకి అనుమతి లేకపోవడంతో సర్వీసులను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఈ ఏడాది మార్చిలోనే ఇండిగో ఢిల్లీ నుంచి ఇస్తాంబుల్‌కు విమాన సర్వీసులను ప్రారంభించిందని పూరీ గుర్తుచేశారు. ఇక పాక్ గగనతలం మూసివేయడంతో ప్రత్యామ్నాయ మార్గంగా విమానం అరేబియన్ సముద్రం మీదుగా పయనించి దోహాలో ఆగి ఇంధనం నింపుకోవాల్సి వచ్చిందని చెప్పారు.
English summary
Due to closure of airspace by Pakistan, national carrier Air India lost Rs 491 crore till July 2, according to data presented by Civil Aviation Minister Hardeep Singh Puri in Rajya Sabha on Wednesday.Private airlines SpiceJet, IndiGo and GoAir lost Rs 30.73 crore, Rs 25.1 crore and Rs 2.1 crore, respectively, the data stated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X