• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఎయిర్ ఇండియాకు మరో ఝలక్.. ఫ్యూయెల్ సప్లై బంద్.. గాల్లో ఎగిరేదెలా..!

|

ఢిల్లీ : ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పాత సమస్యల నుంచి బయటపడదామని ప్రయత్నిస్తున్నప్పటికీ.. కొత్త సమస్యలు చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. ఆ క్రమంలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ సమకూర్చే కంపెనీలు సహాయ నిరాకరణ పాటిస్తున్నాయి. దాంతో ఎయిర్ ఇండియాకు మరో తలనొప్పి ఎదురైంది.

ఎయిర్ ఇండియాకు గడ్డు కాలమేనా?

ఎయిర్ ఇండియాకు గడ్డు కాలమేనా?

ఎయిర్ ఇండియాకు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ సప్లై చేస్తున్న వివిధ చమురు కంపెనీలకు నాలుగున్నర వేల కోట్ల రూపాయలు బకాయి పడటం గమనార్హం. దాంతో ఆయా సంస్థలు ఫ్యూయెల్ సప్లై నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. దాదాపు ఏడు నెలలుగా పెండింగ్ బకాయిలు చెల్లించట్లేదనేది ఆయా కంపెనీలు చెబుతున్న మాట. ఎయిర్ ఇండియా నుంచి పెద్ద మొత్తంలో బకాయిలు రావాల్సి ఉండటంతో ఇంధన సరఫరాకు నో చెబుతున్నాయి

ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ కంపెనీలు. ఈ మూడు కంపెనీలకు కలిపి దాదాపు 4 వేల 500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది ఎయిర్ ఇండియా.

ప్లాన్ ప్రకారమే మర్డర్.. తల ఒకచోట.. మొండెం మరోచోట..!

90 రోజుల క్రెడిట్ లిమిట్.. అయినా 200 రోజులు దాటిందట..!

90 రోజుల క్రెడిట్ లిమిట్.. అయినా 200 రోజులు దాటిందట..!

వ్యాపారంలో భాగంగా క్రెడిట్ లిమిట్ అనేది అన్ని రంగాల్లోనూ కనిపిస్తుంటుంది. అదే క్రమంలో ఎయిర్ ఇండియాకు జెట్ ఇంధనం సప్లై చేసే ఆయా కంపెనీలు కూడా 90 రోజులు వరకు అంటే మూడు నెలల క్రెడిట్ వ్యవధి సౌకర్యం కల్పిస్తున్నాయి. అయినప్పటికీ ఎయిర్ ఇండియా సకాలంలో బకాయిలు చెల్లించడం లేదనేది ఇంధన సరఫరా సంస్థలు చెబుతున్న మాట. క్రెడిట్ వ్యవధి 90 రోజులు దాటి 200 రోజులు మించిపోతున్నా కూడా ఎయిర్ ఇండియా మౌనం దాల్చడంపై చమురు కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

వేల కోట్లు పెండింగ్.. 60 కోట్ల చెల్లించడానికి సిద్ధమట..!

వేల కోట్లు పెండింగ్.. 60 కోట్ల చెల్లించడానికి సిద్ధమట..!

అదలావుంటే భారీ స్థాయిలో బకాయిలు పెండింగ్‌లో ఉంటే ఎయిర్ ఇండియా మాత్రం కేవలం 60 కోట్ల రూపాయలు చెల్లించడానికి ముందుకు రావడం గర్హనీయమని అంటున్నాయి చమురు కంపెనీలు. ఆ క్రమంలో ఈ మూడు కంపెనీలు ఏకతాటిపైకి వచ్చి పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ పోయిన వారం ఎయిర్ ఇండియాకు లేఖ కూడా రాశాయి. వెంటనే బకాయిలు చెల్లించాలని కోరాయి. లేని పక్షంలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ సప్లైను ఆపివేస్తామని హెచ్చరించాయి. అయినా కూడా ఎయిర్ ఇండియా అధికారులు స్పందించలేదని తెలుస్తోంది. ఆ క్రమంలో విశాఖపట్నం, రాంచీ, మొహాలీ, కొచ్చిన్, పుణె, పాట్నా తదితర ప్రాంతాల్లో ఫ్యూయెల్ సప్లై నిలిచిపోవడంతో ఎయిర్ ఇండియా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

వామ్మో, ఎలా వచ్చాడు.. విమానం ఎగిరే సమయంలో.. రన్ వే పైకి..!

ఆపరేషన్ పవర్ సూపర్.. కానీ, రుణ భారం తలనొప్పిగా..!

ఆపరేషన్ పవర్ సూపర్.. కానీ, రుణ భారం తలనొప్పిగా..!

చమురు కంపెనీలకు చెల్లించాల్సిన ఇంధన బకాయిలపై ఎయిర్ ఇండియాకు ఓ క్లారిటీ లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏ రకంగా ఆ బకాయిలను చెల్లిస్తే సమస్య నుంచి గట్టెక్కవచ్చో తెలుసుకోవడం లేదనే ఆరోపణలు కొకొల్లలు. అయితే పెండింగ్ బకాయిలు చెల్లించడంలో విఫలం కావడమే గాకుండా.. ప్రణాళిక బద్ధంగా వ్యవహరించని ఎయిర్ ఇండియాకు ఇంధన సప్లై కష్టంతో కూడుకున్న పని అంటున్నాయి చమురు కంపెనీలు.

అదలావుంటే ఎయిర్ ఇండియా ఆపరేషన్ పవర్ మెరుగ్గానే ఉందంటున్నారు ఆ సంస్థ ప్రతినిధులు. అయితే నిధుల సమీకరణ క్లిష్టతరంగా మారడంతో చెల్లింపులు, రుణాలు, పెండింగ్ బకాయిల విషయంలో వెనుకడుగు పడుతోందని చెబుతున్నారు. అంతా సవ్యంగా ఉన్నప్పటికీ 58 వేల కోట్ల రూపాయలకు చేరిన రుణ భారం సంస్థకు తలనొప్పిగా మారిందని అంటున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Cash strapped Air India Ltd. stares at a turbulent future as oil marketing companies on Thursday stopped fuel supplies at six tier two airports like Cochin, Pune, Patna, Ranchi, Mohali, and Visakhapatnam due to non payment of dues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more