బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండు ఐటీ హబ్‌లను కలుపుతూ 18 గంటల నాన్‌స్టాప్ ఫ్లయిట్‌

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ప్రపంచంలోనే ఎక్కువ సేపు ప్రయాణించే నాన్ స్టాప్ ఫ్లయిట్‌ను ఎయిర్ ఇండియా అతి త్వరలో ప్రవేశపెట్టనుంది. భారత్ ఐటీ రాజధాని బెంగుళూరు నుంచి సిలికాన్ వ్యాలీ ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో‌ను కలుపుతూ ఎయిర్ ఇండియా ఓ నాన్ స్టాప్ ఫ్లయిట్‌ తొలిసారిగా ప్రారంభించనుంది.

మొత్తం 8,700 మైళ్ళు (14,000 కిలోమీటర్లు) ఉన్న ఈ ప్రయాణం సుమారు 17 నుంచి 18 గంటలు పడుతుందని అంచనా వేస్తున్నారు. బెంగుళూరులో టేకాఫ్ ఆయిన ఎయిర్ ఇండియా నాన్ స్టాప్ విమానం శాన్ ఫ్రాన్సిస్కో‌లోనే ల్యాండింగ్ అవుతుంది.

ఈ సర్వీస్‌ని ఎయిర్ ఇండియా ప్రారంభిస్తే ఇదే ఎక్కువ సేపు ప్రయాణించే నాన్ స్టాప్ ఫ్లయిట్‌ అవుతుందని ఎయిర్ ఇండియా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్ నుంచి ఆస్టేలియాలోని సిడ్నీ మధ్య నడిచే క్వాంటాస్ ఎయిర్ లైన్స్ నడిపే విమాన సర్వీసే ఎక్కువ సేపు ప్రయాణించే ప్లయిట్‌గా చెప్పుకుంటున్నారు.

Air India proposes world's longest non-stop flight between Bengaluru and San Francisco

ఈ రెండింటీ మధ్య దూరం 8,578 మైళ్లు (13,740 కిలోమీటర్లు). అయితే ఇప్పుడు ఆ స్థానాన్ని ఎయిర్ ఇండియా సొంతం చేసుకోనుంది. ఇప్పటిదాకా శాన్ ఫ్రాన్సిస్కో- ఇండియాల మధ్య ఇలాంటి నాన్ స్టాప్ ఫ్లయిట్ సర్వీస్ లేదనీ, ఈ సర్వీస్ ప్రారంభమైతే సిలికాన్ వ్యాలీలో ఉండే భారతీయులకు ఎంతో ఉపయోగ పడుతుందని ఎయిర్ ఇండియా అధికారులంటున్నారు.

ఈ సర్వీసుని ఫిబ్రవరి 2016లో ప్రారంభించేందుకు ఎయిర్ ఇండియా సన్నాహాలు చేస్తుంది. దీంతో పాటు ఢిల్లీ నుంచి నేరుగా శాన్ ఫ్రాన్సిస్కో కు బోయింగ్ 777 200 లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్‌తో నాన్ స్టాప్ సర్వీస్ ఏర్పాటు చేయాలన్న ప్లాన్‌లో కూడా ఎయిర్ ఇండియా ఉందని అధికారులు చెబుతున్నారు.

కాలిఫోర్నియాలోని శాప్ సెంటర్‌లో ప్రవాస భారతీయలను ఉద్దేశించి ప్రసంగించిన మోడీ ఢిల్లీ నుంచి నేరుగా శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ ఇండియా విమానాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. బెంగుళూరు, శాన్ ఫ్రాన్సిస్కోల రెండు సైబర్ హబ్స్‌గా ఎదిగినప్పటికీ ఈ రెండు నగరాల మధ్య నేరుగా ప్లయిట్ లేకపోవడం సాప్ట్‌వేర్ నిపుణులను కాస్తంత ఇబ్బందికి గురి చేస్తుంది.

దీంతో పాటు అహ్మదాబాద్ నుంచి లండన్‌కు ప్రయాణించే ప్రయాణికులను రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆహ్మదాబాద్ నుంచి లండన్‌కు నేరుగా సర్వీసుని ప్రారంభించాలనే ఆలోచనలో ఎయిర్ ఇండియా ఉంది. మరోవైపు సింగపూర్ ఎయిర్ లైన్స్ కూడా సింగపూర్ - న్యూయార్క్ సిటీల మధ్య 19 గంటల నాన్‌స్టాప్ ఫ్లయిట్ సర్వీస్‌లను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

English summary
Air India has recently proposed a new flight route linking the IT hotspots of Bengaluru and San Francisco, located a staggering 8,699 miles (14,000km) apart.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X