వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆలస్యానికి రూ.15 లక్షలు చెల్లించాల్సిందే, రవీంద్ర గైక్వాడ్ పై ఎయిరిండియా పోరాటం

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ పై న్యాయపోరాటానికి ఎయిరిండియా సిద్దమైంది.ఆయనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసినా కాని, న్యాయపోరాటాన్ని కొనసాగిస్తామని ఎయిరిండియా ప్రకటించింది.

శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ మీద నిషేధాన్ని ఎయిరిండియాతో పాటు ఇతర ప్రైవేట్ విమానాయాన సంస్థలు విధించాయి.అయితే క్షమాపణ కోరుతూ శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్ కేంద్ర విమానాయాన శాఖ మంత్రి ఆశోక్ గజపతిరాజుకు లేఖ రాయడంతో ఆయనపై విధించిన ట్రావెల్ బ్యాన్ ను ఎత్తివేశాయి.

గత నెల 23వ, తేదిన జరిగిన వివాదంలో ఎయిర్ క్రాఫ్ట్ (ఎఐ 852) ను 90 నిమిషాల పాటు నిలిపివేయాల్సి వచ్చిందిం. అయితే ఈ కారణంగా గైక్వాడ్ రూ.15 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని ఎయిరిండియా స్పష్టం చేసింది.

Air india ready to sue shiv sena Mp Ravindra gaikwad for 15 lakhs

గైక్వాడ్ కారణంగానే విమానం ఆలస్యమైందని ఎయిరిండియా స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకొంటామని ఆ సంస్థ ప్రకటించింది.

ఫెడరేషన్ ఆఫ్ ఇండియాన్ ఎయిర్ లైన్స్ (ఎఫ్ ఐఏ ) లో సభ్యత్వం ఉన్న ఇండిగో , స్పైస్ జెట్ , గో ఎయిర్ , టాటా గ్రూప్ ఎయిర్ లైన్స్ , విస్తారా, ఎయిర్ ఏషియా లాంటి సంస్థలు మార్చి 24వ, తేది నుండి ఎంపీ గైక్వాడ్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశాయి.

ఎఫ్ఐఏ లో సభ్యత్వం ఉన్న విమానాయాన సంస్థలన్నీ గైక్వాడ్ ను తమ విమానాల్లో అనుమతించాలని నిర్ణయించినట్టుగా ఎఫ్ఐఏ డైరెక్టర్ ఉజ్వల్ డే చెప్పారు.

తమ సిబ్బందిని ఎంపీ గైక్వాడ్ గౌరవించాల్సిందేనని ఆయనయ చకెప్పారు. ప్రతిరోజూ తమ సిబ్బంది కష్టపడుతున్నారని చెప్పారు. విమాన ఆస్తులకు నష్టం కల్గించకూడదని ఆయా సంస్థలు ఎంపిని కోరాయి.

English summary
Air india is preparing for a legal battle against Shiv sena Mp Ravindra gaikwad for causing revenue losses worth up to Rs 15 lakhs .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X