వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛీఛీ ఇదేం పాడు బుద్ధి: ఆహోదా ఏంటి.. ఆ చిల్లరపనేంటి..ఇతగాడు పరువు తీసేశాడుగా..!

|
Google Oneindia TeluguNews

మన దేశంలో దొరలా బతికేవారు విదేశాలకు వెళ్లిపోగానే దొంగలా మారుతున్నారు. అక్కడి వారికి చిక్కి దేశ పరువును తీసేసుస్తున్నారు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నామనుకుంటున్నారా..? సిడ్నీలో ఓ భారతీయుడు దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఇంతకీ ఆయన చేసే పనేమిటో తెలిస్తే షాక్‌కు గురవుతారు. అంతటి హోదాలో ఉంటూ దొంగతనం చేయడమేంటని మీరే అసహ్యించుకుంటారు.

ఈ మధ్యకాలంలో ఎయిరిండియా ఉద్యోగులు తరుచూ సస్పెండ్‌కు గురవుతున్నారు. ఒకరు అమ్మాయిని వేధించిన కేసులో కొద్దిరోజుల క్రితం సస్పెండ్ అయితే నిన్నగాక మొన్న లంచ్ బాక్స్ విషయంలో కిందిస్థాయి సిబ్బందితో గొడవపడి విమానం టేకాఫ్‌ను ఆలస్యం చేసినందుకు పైలట్‌పై వేటు పడింది. తాజాగా సిడ్నీలో దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిన ఈస్ట్ రీజియనల్ డైరెక్టర్ రోహిత్ భాసిన్‌ను ఎయిరిండియా సంస్థ సస్పెండ్ చేసింది. ఎయిరిండియా విమానం ఏఐ301కు పైలట్‌గా ఉన్న రోహిత్ భాసిన్ సిడ్నీలోని ఓ దుకాణంలోకి వెళ్లి ఒక పర్సును కొట్టేశాడు. జూన్ 22న ఉదయం ఎయిరిండియా విమానం 10గంటల 45 నిమిషాలకు సిడ్నీ నుంచి ఢిల్లీకి బయలుదేరాల్సి ఉంది. అంతకుముందే పైలట్ రోహిత్ భాసిన్ ఒక షాపులోకి వెళ్లి పర్సును కొట్టేస్తూ పట్టుబడ్డాడు.

Recommended Video

దొంగతనాల పై పోలీసుల ఉక్కుపాదం
Air India regional director suspended for stealing a wallet in Sydney

ఇక పట్టుబడగానే ఆస్ట్రేలియా రీజియనల్ మేనేజర్ ఎయిరిండియా విమానయాన సంస్థకు జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. ఇక ఫిర్యాదు స్వీకరించిన ఎయిరిండియా యాజమాన్యం పైలట్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించింది. తమ సిబ్బంది క్రమశిక్షణతో ఉండేలా ఎయిరిండియా జాగ్రత్తలు తీసుకుంటుందని ఎవరైనా క్రమశిక్షణ తప్పితే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడబోదని ఎయిరిండియా ప్రతినిధి ధనుంజయ్ కుమార్ తెలిపారు.ఇక డైరెక్టర్ పైలట్ రోహిత్ భాసిన్ ఎయిరిండియా ప్రెమిసెస్‌లోకి ప్రవేశించడాన్ని నిషేదిస్తున్నామని చెప్పిన ధనుంజయ్ ఆయన తన బేస్ అయిన కోల్‌కతాను విడిచి వెళ్లకూడదని ఆదేశించారు. అంతేకాదు మరో ఉద్యోగం కూడా రాకుండా ఆయనపై చర్యలు తీసుకున్నట్లు ధనుంజయ్ కుమార్ తెలిపారు.

English summary
Air India on Sunday suspended its Regional Director for East, Rohit Bhasin, for allegedly shoplifting from a duty-free shop at Sydney airport in Australia. Rohit Basin, who was rostered as one of the pilots of flight AI301, shoplifted a wallet before the departure of flight at 10.45 am from Sydney for Delhi on June 22.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X