వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్ ఇండియా: ఇది జాతి వ్యతిరేక చర్య, కోర్టును ఆశ్రయిస్తా, సుబ్రమణ్య స్వామి

|
Google Oneindia TeluguNews

ఎయిర్ ఇండియా 100 శాతం వాటాలను విక్రయించేందుకు బిడ్లను ఆహ్వానిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం దుమారం రేపింది. విపక్షమే కాదు స్వపక్షం నుంచి కూడా మోడీ సర్కార్ విమర్శలను ఎదుర్కొంటుంది. స్వపక్షంలో విపక్షంలా వ్యవహారించే సుబ్రమణ్యస్వామి కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని చెప్పి బాంబు పేల్చారు.

కోర్టును ఆశ్రయిస్తా..

కోర్టును ఆశ్రయిస్తా..


ఎయిర్ ఇండియా వాటాల విక్రయంపై కోర్టును ఆశ్రయిస్తానని సుబ్రమణ్యస్వామి స్పష్టంచేశారు. ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరించే చర్య జాతి వ్యతిరేకమని సుబ్రమణ్యస్వామి దుయ్యబట్టారు. ఎయిర్ ఇండియా వాటాలు విక్రయించి కీలకమైన విమానయాన సంస్థలపై కూడా ప్రైవేట్ రంగాలను ఆహ్వానించినట్లవుతోందని పేర్కొన్నారు. ఇది సరికాదని నిర్ణయాన్ని సమీక్షించాలని కోరారు.

జాతి వ్యతిరేక చర్య

జాతి వ్యతిరేక చర్య

‘దేశంలో పెట్టుబడుల ప్రక్రియ పున:ప్రారంమైంది.. కానీ ఇది యావత్ జాతికి వ్యతిరేకమైన చర్య అన్నారు. దీనిపై న్యాయస్థానంలో పోరాటం చేస్తానని చెప్పారు. ఎయిర్ ఇండియా అనేది కుటుంబం అని, దానిని విక్రయించేందుకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోను' అని సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేశారు.

కొరకరాని కొయ్య

కొరకరాని కొయ్య

ఇప్పుడే కాదు వివిధ అంశాలపై సుబ్రమణ్యస్వామి సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు పెడతారు. తమిళనాడులో అప్పటి సీఎం జయలలిత ఆస్తుల కేసు ఐటీ విభాగానికి రావడానికి కారణం సుబ్రమణ్య స్వామే ఆయన కేసు వేయడంతోనే జయలలిత సీఎం పదవీ వదులుకొవాల్సి వచ్చింది. తర్వాత సీఎం పదవీ చేపట్టినా.. ఆస్తుల కేసు జయలలిత రాజకీయ జీవితంలో మాయనిమచ్చగా మారింది.

బిడ్లకు ఆహ్వానం

బిడ్లకు ఆహ్వానం

ఎయిర్ ఇండియాలోని డొమెస్టిక్, ఇంటర్నేషనల్ రూట్లలో వాటాలు అప్పగిస్తామని పేర్కొన్నది. బిడ్లు దాఖలు చేసేందుకు ఆయా సంస్థలకు మార్చి 17 తేదీ గడువుగా నిర్ణయించింది. బిడ్డర్ 3.26 బిలియన్ల రుణం అందజేసి.. ఇతర బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంటుందని తెలిపింది. 2018లో ఎయిర్ ఇండియా 76 శాతం వాటాను విక్రయించడానికి ప్రయత్నించింది. అయితే అందుకు 5.1 బిలియన్ డాలర్లు కోట్ చేయడంతో.. బిడ్లు దాఖలు చేసేందుకు ఏ సంస్థ ముందుకురాలేదు.

English summary
will be forced to move the court on air india sale Subramanian Swamy said. He has also called the decision "anti-national".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X