వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిరిండియా స్కాం: చిదంబరంను ప్రశ్నించిన ఈడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరంను ఏవియేషన్ స్కాంకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు శుక్రవారం విచారించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన నెల రోజుల వ్యవధిలోనే ఎయిరిండియా స్కాంలో ఈడీ విచారణ చేపట్టింది.

ఆరుగంటలపాటు ఈడీ అధికారులు చిదంబరాన్ని ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి 2019 ఆగస్టు 23న తమ ఎదుట హాజరుకావాలంటూ ఈడీ అధికారులు చిదంబరంకు గతంలోనే సమన్లు చేశారు. అయితే, ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆగస్టు 20న సీబీఐ చిదంబరంను అరెస్ట్ చేయడంతో ఈడీ ముందు హాజరుకాలేకపోయారు.

Air India scam: ED questions P Chindambaram

ఎయిర్ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ కొనుగోలుకు సంబంధించిన కేసులో సంబంధిత ఫైలుపై చిదంబరం ఆమోదం తెలిపారని తేలడంతో ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. 2009లో ఎయిర్ బస్ నుంచి 43 విమానాలు కొనుగోలు చేయాలనే కాంట్రాక్టును పీ చిదంబరం నేతృత్వంలోని మంత్రుల కమిటీ ఖరారు చేసినట్లు సమాచారం.

111 విమానాల కోసం రూ. 70వేల కోట్లు వెచ్చించేందుకు ఈ డీల్ చేసుకున్నారు.
కాగా, ఈ ఒప్పందాన్ని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ముందుకు పంపినప్పుడు సదరు కంపెనీ శిక్షణా సదుపాయాలు, నిర్వహణ, మరమ్మతుల(ఎంఆర్ఓ) కేంద్రాల అభివృద్ధి చేయాలనే షరతులను చేర్చి కొనుగోలు ఆర్డర్‌లో మాత్ర ఆ క్లాజును తొలగించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే చిదంబరంను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.

English summary
The Enforcement Directorate (ED) Friday questioned former Union finance minister P Chidambaram in connection with the alleged multi-crore aviation scam during the UPA-era, reported PTI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X