వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్‌ఇండియాకు 58 వేల కోట్ల అప్పులు, ప్రైవేటీకరించాల్సిందే, ఉద్యోగ భద్రతకు హామీ: మంత్రి పురి

|
Google Oneindia TeluguNews

ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించాల్సిందేనని పౌరవిమానయానశాఖ తేల్చిచెప్పింది. లేదంటే సంస్థను నడపడం కష్టమని పేర్కొన్నది. ఇప్పటికే సంస్థ 58 వేల కోట్ల అప్పుల్లో ఉందని ఆ శాఖ మంత్రి హర్దిప్ సింగ్ పూరి పేర్కొన్నారు. ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించాల్సిందేనని బుధవారం పార్లమెంట్‌‌కు తెలిపారు.

 ప్రైవేటీకరణ తప్పదు..

ప్రైవేటీకరణ తప్పదు..

ఎయిర్ ఇండియా ప్రైవేటీకరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. లేదంటే సంస్థను నడపలేమని తేల్చిచెప్పారు. ఈ మేరకు రాజ్యసభలో అనుబంధ ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఇదే సమయంలో ఎయిర్ ఇండియా ఉద్యోగుల ఉద్యోగ భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. సంస్థలో పనిచేసే ఉద్యోగులుకు జీతాలు కూడా ఇవ్వడం లేదని.. అందుకే కొందరు జాబ్ మానేస్తున్నారని వాదనను తోసిపుచ్చారు.

అబ్బే.. తెలియదే..

అబ్బే.. తెలియదే..

మిగతా విమానయాన సంస్థలతో పోల్చితే ఎయిర్ ఇండియా ఉద్యోగులకు మంచి జీత భత్యం అందిస్తున్నామని చెప్పారు. కానీ ఉద్యోగుల రాజీనామా అంశం తన దృష్టికి రాలేదని చెప్పారు. ఎయిర్ ఇండియా నష్టాలపై ప్రభుత్వం కూడా దృష్టిసారించింది. ప్రైవేటీకరణ కోసం ఇదివరకు ప్రయత్నాలు కూడా చేసింది.

సెప్టెంబర్‌లో బీజం..

సెప్టెంబర్‌లో బీజం..

సెప్టెంబర్‌లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశమై చర్చించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య, రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ సహా హర్దిప్ సింగ్ పూరి సమావేశమై.. ఎయిర్ ఇండియా విక్రయం గురించి చర్చించారు. దీనిపై అధికారులు సమాచారాన్ని సేకరిస్తూనే ఉన్నారు.

ఏడాది నష్టాలివే..

ఏడాది నష్టాలివే..

విధివిధానాలు తుదిదశకు చేరితే.. ప్రభుత్వం బిడ్లను ఆహ్వానిస్తోందని అని పురి పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా 76 శాతం వాటా విక్రయించేందుకు కంపెనీ ముందుకొచ్చిందని మంత్రి హర్దిప్ సింగ్ పూరి తెలిపారు. 2018-19 ఏడాదిలోనే సంస్థ 7600 కోట్లనష్టాలను చవిచూసిందని పేర్కొన్నారు.

ఉద్యోగ భద్రతకు హామీ

ఉద్యోగ భద్రతకు హామీ


ఎయిర్ ఇండియా సంస్థకు 9400 మంది శాశ్వత ఉద్యోగులు, 4200 మంది తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారు. సంస్థ ప్రైవేటీకరించడంతో ఉద్యోగుల ఉద్యోగానికి వచ్చిన ముప్పేమీ లేదని మంత్రి హర్దిప్ సింగ్ పూరి స్పష్టంచేశారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఫోకస్ చేస్తామని తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్యంపై కూడా శ్రద్ద చూపుతామని తెలిపారు.

English summary
Minister of Civil Aviation Hardeep Singh Puri told the ParliamentAir India, which has a debt burden of over Rs 58,000 crore, would have to cease operations if the state-run airline was not privatised.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X