వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో! ఆ విమానం రెండు సార్లు లక్కీ - గంటల వ్యవధిలో తృటిలో ఎస్కేప్ - రాంచీ ఎయిర్ పోర్టులో..

|
Google Oneindia TeluguNews

కేరళలోని కొజికోడ్ లో ఎయిర్ ఇండియా విమానం పెనువిషాదం చోటుచేసుకున్న తర్వాతి రోజే.. జార్ఖండ్ రాజధాని రాంచీలో మరో విమానం తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. గంటల వ్యవధిలోనే రెండు సార్లు డేంజర్ నుంచి ఎస్కేప్ అయిన ఆ విమానాన్ని ఇవాళ్టికీ లక్కీ ఫ్లైట్ గా, అందులోని 176 మంది ప్రయాణికుల్ని అదృష్టవంతులుగా అందరూ కొనియాడుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇలా ఉంది..

జగన్ పై సోము వీర్రాజు 'అయోధ్య' అస్త్రం - తొలిసారి కన్నాతో భోజనం - బీజేపీలోకి గంటా శ్రీనివాసరావు?జగన్ పై సోము వీర్రాజు 'అయోధ్య' అస్త్రం - తొలిసారి కన్నాతో భోజనం - బీజేపీలోకి గంటా శ్రీనివాసరావు?

ఇంకాసేపట్లో టేకాఫ్ అనగా..

ఇంకాసేపట్లో టేకాఫ్ అనగా..

ఎయిర్ ఏషియాకు చెందిన VT-HKG విమానం(సర్వీస్ నంబర్ i5-632) శనివారం ఉదయం 11:50కి రాంచీ బిర్సా ముండా ఎయిర్ పోర్టు నుంచి ముంబైకి బయలుదేరింది. పైలట్లు, సిబ్బంది కాకుండా అందులో మొత్తం 176 మంది ప్రయాణికులున్నారు. రన్ వేపై వేగంగా దూసుకెళ్లిన విమానం.. ఇంకొద్ది క్షణాల్లో టేకాఫ్ అవుతుందనగా ఓ పక్షిని ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన పైలట్లు.. విమానం వేగాన్ని తగ్గించేసి మళ్లీ పోర్టుకు తిరొచ్చారు.

 డైరెక్టర్ వివరణ..

డైరెక్టర్ వివరణ..

కొజికోడ్ ఎయిర్ ఇండియా ప్రమాదం నేపథ్యంలో ఎయిర్ ఏషియా విమానం పక్షిని ఢీకొట్టిన ఘటన వైరల్ అయింది. దీనిపై రాంచీ బిర్సా ముండా ఎయిర్ పోర్టు డైరెక్టర్ వినోద్ శర్మ మీడియాకు వివరణ ఇచ్చారు. ఘటనలో ఎవరికీ హాని జరగలేదని, విమానం కూడా డ్యామేజీ కాలేదని, నిబంధనల ప్రకారం తగిన పరిశీల‌న‌లు జరిపిన అనంతరం అది ముంబై బ‌య‌లుదేరుతుంద‌ని శర్మ చెప్పారు. అయితే రెండో సారి కూడా అనూహ్యంగా ఉపద్రవం తలెత్తింది..

 గంటల వ్యవధిలో మళ్లీ..

గంటల వ్యవధిలో మళ్లీ..

పక్షిని డీకొట్టిన తర్వాత ఎయిర్ ఏషియా విమానానికి.. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) ఇంజనీర్లు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ (SOP) సజావుగా ఉన్నాయని, సర్వీసును కొనసాగించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇంజనీర్లు, నిపుణులు, గ్రౌండ్ స్టాఫ్ క్లియరెన్స్ ఇవ్వడంతో సాయంత్రం పూట విమానం మరోసారి టేకాఫ్ కు సిద్ధమైంది. రెండో సారి కూడా విమానం రన్ వేపై వేగంగా దూసుకెళ్లినా.. టేకాఫ్ గేరు పని చేయలేదు. దీంతో పైలట్లు సహా అందరూ నిర్ఘాంతపోయారు. ఈసారి కూడా పైలట్లు చాకచక్యంగా విమానాన్ని స్లో చేసి పోర్టుకు తిరిగొచ్చారు.

ఆ లక్కీ విమాన సర్వీసు రద్దు..

ఆ లక్కీ విమాన సర్వీసు రద్దు..

గంటల వ్యవధిలోనే రెండు సార్లు తృటిలో ప్రమాదం నుంచి బయటపడిన ఆ లక్కీ విమాన సర్వీసు చివరికి రద్దయింది. ఉదయం నుంచి సాయంత్రం దాకా చోటుచేసుకున్న హైడ్రామాలో చివరికి ప్రాణాలతో బయటపడ్డ ప్యాసింజర్లలో కొందరు వేరే సర్వీసుల్లో గమ్యస్థానాలకు వెళ్లిపోగా, చాలా మంది ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. కాగా, పక్షిని ఢీకొట్టిన విమానాన్ని డీజీసీఏ సరిగా తనిఖీ చేసిందా? లేదా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై అధికారులు, ఎయిర్ లైన్స్ వివరణ ఇవ్వాల్సి ఉంది. అటు కొజికోడ్ ఎయిర్ పోర్టులో ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ ఘటనలో మృతుల సంఖ్య 18కి పెరిగింది. పైలట్ల తప్పుడు అంచనాల వల్లే ప్రమాదం జరిగిందని డీజీసీఏ చీఫ్ అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.

Recommended Video

Domestic Flights To Resume Operations Starting May 25

చైనా కిరికిరితో దెప్సాంగ్ లో హైటెన్షన్ - డ్రాగన్ ఆర్మీతో కీలక చర్చలు - ఐఏఎఫ్ యుద్ధ సన్నద్ధత..చైనా కిరికిరితో దెప్సాంగ్ లో హైటెన్షన్ - డ్రాగన్ ఆర్మీతో కీలక చర్చలు - ఐఏఎఫ్ యుద్ధ సన్నద్ధత..

English summary
A Mumbai-bound Air Asia India flight, which was grounded at the Ranchi airport on Saturday morning after a bird hit the aircraft during take-off, developed another technical snag while it was on the runway ready to take-off again hours later.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X