వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్‌సెల్ మాక్సిస్ కేసు: చిదంబరంకు ఊరట, అప్పటి వరకు అరెస్ట్ లేనట్లే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌ మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి కోర్టులు ఊరట లభించింది. ఈ కేసు విచారణ నిమిత్తం అరెస్టు చేయకుండా ఉండేందుకు చిదంబరం ముందస్తు బెయిల్‌ కోరుతూ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైని ముందస్తు బెయిలు ఇచ్చేందుకు అంగీకరించారు.

జూన్‌ 5లోగా ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలియజేయాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నివేదికను కోరింది. అప్పటి వరకు చిదంబరంపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని, అరెస్ట్ చేయవద్దని ఈడీ అధికారులను ఆదేశించింది. మరోవైపు జూన్‌ 5న విచారణకు హాజరు కావాల్సిందిగా చిదంబరానికి ఈడీ ఇప్పటికే సమన్లు పంపించింది.

 Aircel-Maxis case: Chidambaram gets protection from arrest till June 5

ఈ కేసుకు సంబంధించిన ఇప్పటికే చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి జులై 10 వరకు ముందస్తు బెయిల్‌ ఇచ్చారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌ ఒప్పందానికి అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం అనుమతి ఇచ్చారని సీబీఐ, ఈడీ వాదిస్తోంది. ఇందుకు గాను ఆయన కుమారుడు కార్తీ చిదంబరానికి భారీ మొత్తంలో ముడుపులు అందాయని సీబీఐ ఆరోపిస్తుంది. కార్తీ చిదంబరంను కూడా ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

English summary
Patiala House Court directed former Finance Minister P Chidambaram to appear before the Enforcement Directorate (ED) on 5th June in connection with Aircel Maxis case. The court also ruled that no coercive action can be taken against Chidambaram till then.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X