వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్‌సెల్ మాక్సిస్ డీల్: మారన్ బ్రదర్స్‌కు సమన్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ‌: మాజీ టెలికం మంత్రి దయానిధి మారన్‌కు, ఆయన సోదరుడికి, మరో ఇద్దరికి ఢిల్లీ ప్రత్యేక కోర్టు బుధవారంనాడు సమన్లు జారీ చేసింది. ఎయిర్‌సెల్ మాక్సిస్ డీల్ కేసులో కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. సన్ డైరెక్ట్ టీవితో పాటు నాలుగు కంపెనీలకు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది.

దయానిధి మారన్‌తో పాటు ఆయన సోదరుడు కళానిధి మారన్, మలేసియా వ్యాపారవేత్త టి. అనంద కృష్ణన్‌లకు ప్రత్యేక 2జి కోర్టు సమన్లు జారీ చేసింది. వచ్చే ఏడాది మార్చి 2వ తేదీన తమ ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.

Aircel-Maxis deal: Maran brothers, two others summoned as accused

మలేసియాకు చెందిన మాక్సిస్ గ్రూప్ ఉన్నతాధికారి ఆగస్టస్ రాల్ఫ్ మార్షల్‌కు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. ఎయిర్‌సెల్ - మాక్సిస్ డీల్ కేసులో సిబిఐ ఆగస్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. దయానిధి మారన్ డిఎంకె అగ్ర నేతల్లో ఒకరు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం డిఎంకె పనిచేసింది. దయానిధి మారన్ 2004 నుంచి 2007 వరకు టెలికం మంత్రిగా పనిచేశారు.

దయానిధి మారన్ తన అధికారాన్ని ఉపయోగించి ఎయిర్‌సెల్‌ను మాక్సిస్ కంపెనీకి విక్రయించడానికి ఎయిర్‌సెల్ యజమాని సి. శివశంకరన్‌పై 2006లో ఒత్తిడి తెచ్చారని ఆరోపణలు వచ్చాయి. అందుకు ప్రతిఫలంగా మాక్సిస్ దయానిధి మారన్ సోదరుడు కళానిధి మారన్‌కు చెందిన మీడియా సంస్థలో 650 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు ఆరోపణ. అయితే, తాము ఏ విధమైన తప్పు చేయలేదని మారన్ సోదరులు, మాక్సిస్ ఉన్నతాధికారులు అంటూ వస్తున్నారు.

English summary
A Special court on Wednesday summoned former telecom minister Dayanidhi Maran along with his brother, two others and four companies including SUN Direct TV as accused in the Aircel-Maxis deal case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X