
రైతులకు గ్రాండ్ వెల్ కం: హెలికాప్టర్‌తో పూల వర్షం.. ఫ్యామిలీస్ హ్యపీ
వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఉభయ సభల్లో బిల్లును పాస్ చేయించుకుంది. 1,2 డిమాండ్లు తప్ప.. రైతు నేతలు సంతృప్తి చెందారు. దీంతో తమ నిరసనకు ముగింపు పలికారు. ఏడాదిపాటు నిరసన చేపట్టి.. కేంద్రం మెడలు వంచిన రైతు నేతలకు ఘనస్వాగతం లభిస్తోంది. స్వస్థలాల్లో గ్రాండ్ వెల్ కం చెబుతున్నారు.
వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఏడాదిపాటు ఢిల్లీ సరిహద్దుల్లో రైతు నేతలు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. రైతు నేతలకు స్వాగతం తెలుపుతూ.. ఆకుపచ్చ, తెల్ల జెండాలను ప్రదర్శించారు. డ్యాన్స్ చేస్తూ స్వాగతం తెలిపారు. ఇన్ని రోజులకు విజయంతో వచ్చినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. తాము ఇంటికి వచ్చిన సమయంలో పిల్లలు సంబరపడ్డారని వారిలో ఒకరు మీడియాకు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి పోవడం మరవలేమని.. వారంతా సంతోష పడ్డారు.

అంతకుముందు ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తున్నామని ప్రకటించారు. రైతులు ఆందోళనను విరమించాలని కోరారు. దేశ ప్రజలకు, రైతులకు క్షమాపణలు కోరారు. మనస్ఫూర్తిగా వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకుంటున్నామన్నారు. ఆందోళన చేస్తున్న రైతులందరు తమ ఇళ్లకు, పొలాలకు తిరిగి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
వ్యవసాయ బడ్జెట్‌ను ఐదు రెట్లు పెంచామన్నారు. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకుచ్చామన్నారు. రైతు మార్కెట్ల అభివృద్ధి, విస్తరణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. పొలంలో పనిచేసే చిన్న రైతుల కోసం కూడా బీమా సదుపాయం కల్పించామన్నారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బును జమ చేశామన్నారు. తక్కువ ధరకే విత్తనాలు విక్రయించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇటు చెప్పినట్టే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టి.. ఉభయ సభల్లో ఆమోదింపజేసుకున్నారు. దీంతో రైతు నేతలు ఇంటి బాట పట్టారు. వారికి కుటుంబసభ్యులు హార్టీ వెల్ కం చెప్పారు. ఏడాది తర్వాత వారి సంతోషానికి అవధి లేకుండా పోయింది. తెగ సంబరపడిపోయారు. రైతు నేతలు మాత్రం తమ చర్యతో కేంద్రం దిగి రావడంతో హ్యాపీగా ఉన్నారు.