• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బారు అన్నాడు..బీరు అన్నాడు: అడ్వాంటేజ్ తీసుకుని ఎయిర్‌హోస్టెస్‌పై కామంతో కాటేశాడు

|

ముంబై: ఇప్పటి వరకు బస్సులు, ఆటోలు, రైళ్ల వరకే పాకిన అత్యాచార ఘటనలు ఇప్పుడు విమానాశ్రయాల్లోకి కూడా పాకుతున్నాయి. అత్యంత భద్రత కలిగిన విమానాశ్రయాల్లో కూడా కామాంధులు రెచ్చి పోతున్నారు. అమ్మాయిలు కనిపిస్తే చాలు కాటేస్తున్నారు మృగాళ్లు. తాజాగా ఓ ఎయిర్‌ హోస్టెస్‌పై అదే ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగి అత్యాచారం చేశాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

 ఒకే ట్యాక్సీలో కలిసి ప్రయాణం

ఒకే ట్యాక్సీలో కలిసి ప్రయాణం

జూన్ 3వ తేదీన హైదరాబాదు నుంచి ముంబై వెళ్లింది ఓ ఎయిర్‌హోస్టెస్. విమానాశ్రయం నుంచి ఎయిర్‌హోస్టెస్ మరియు నిందితుడు ఇద్దరూ ఒకే ట్యాక్సీ మాట్లాడుకొని అందులో బయలు దేరారు. మలాడ్‌‌లోని ఓ మాల్‌కు చేరుకోగానే ఆ వ్యక్తి దిగిపోయాడు. అనంతరం కండివ్లి వరకు అదే కారులో ప్రయాణించింది ఎయిర్‌హోస్టెస్. కండివ్లీలో ఆమె లగేజీ పెట్టి తిరిగి మలాడ్‌లోని అదే మాల్‌కు వెళ్లి ఆ వ్యక్తిని కలవాల్సి ఉంది. వారిద్దరూ ఓ బార్‌లో కలుద్దామని ముందుగానే అనుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక సోమవారం రాత్రి నుంచి మంగళవారం అర్థరాత్రి 1:30 వరకు ఇద్దరూ పిచ్చపాటిగా కబుర్లు చెప్పుకున్నారు. అదే సమయంలో మద్యం కూడా సేవించారు.

 మత్తులో ఉన్న ఎయిర్‌హోస్టెస్‌ను తన గదికి తీసుకెళ్లాడు

మత్తులో ఉన్న ఎయిర్‌హోస్టెస్‌ను తన గదికి తీసుకెళ్లాడు

ఎయిర్‌హోస్టెస్‌ కూడా మద్యం సేవించి ఉండటంతో ఇక్కడే కంత్రీ బ్రెయిన్ వాడాడు ఆ వ్యక్తి. అంధేరీలోని తన గదికి తీసుకెళుతానంటూ చెప్పాడు. పరిచయం ఉన్న వ్యక్తే కదా అని అతనితో వెళ్లింది. తన ఇంటికి వెళ్లే సరికి అప్పటికే ఆ ఇంట్లో వ్యక్తికి సంబంధించిన ఇద్దరు మిత్రులు మరో అమ్మాయి ఉన్నట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఇక మత్తులో ఉన్న తను నిద్రకు ఉపక్రమించినట్లు చెప్పింది. నిద్రలో ఉండగా ఆ వ్యక్తి తనపై లైంగిక దాడికి పాల్పడి అత్యాచారం చేశాడని పేర్కొంది. అప్పటికే ఎయిర్‌హోస్టెస్ తండ్రి, ఆమె బాయ్‌ఫ్రైండ్ ఫోనులో ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నించారు కానీ ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

 ఒంటిపై గాయాలేంటి అని తండ్రి అడగడంతో బయటకొచ్చిన ఘటన

ఒంటిపై గాయాలేంటి అని తండ్రి అడగడంతో బయటకొచ్చిన ఘటన

ఇక ఎయిర్‌హోస్టెస్ ముంబైకి వచ్చిందన్న విషయం తెలుసుకున్న ఆమె బాయ్‌ఫ్రెండ్ ఆమెకు ఫోన్ చేయగా తానొక ఫుడ్ కోర్టులో ఉన్నట్లు తెలిపింది. వెంటనే ఆమె బాయ్‌ఫ్రెండ్ మంగళవారం ఉదయం 11 గంటలకు అక్కడకు చేరుకోగా ఆమె నిందితుడితో కనిపించింది. అక్కడి నుంచి ఆ ఎయిర్‌హోస్టెస్‌ను ఆమె ఇంటికి తీసుకెళ్లాడు. ఆమెను చూసిన తండ్రి రాత్రంతా ఎక్కడికెళ్లావ్ అని ప్రశ్నించాడు. అంతేకాదు ఆమె శరీరంపై ఉన్న గాయాలను చూసి గట్టిగా అడగటంతో తనను ఓ వ్యక్తి రేప్ చేశాడని భోరున విలపించింది. వెంటనే దగ్గరలోని కేఈఎం హాస్పిటల్‌కు తీసుకెళ్లగా ఆమె అత్యాచారంకు గురైనట్లు వైద్యులు ధృవీకరించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడితో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు పిలిపించి విచారణ చేసి అరెస్టు చేశారు.

English summary
A airhostess was allegedly raped by her collleague in Mumbai. The airhostess and the accused spent some time in a bar after which the accused took her to her apartment and raped her who was in an inebirated state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X