వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్వర్లలో సాంకేతిక లోపం: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ఎయిరిండియా సేవలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

#AirIndia : ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ఎయిరిండియా సేవలు || Oneindia Telugu

న్యూఢిల్లీ: దేశీయ విమానాయాన సంస్థ ఎయిరిండియాలో మళ్లీ ఇబ్బందులు తలెత్తాయి. అయితే ఈ సారి విమానాల్లో కాదు... ఎయిరిండియా సర్వర్లలో సమస్య వచ్చింది. ఒక్కసారిగా ప్రధాన సర్వర్ షట్‌డౌన్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిరిండియా సేవలకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వర్ షట్‌డౌన్‌తో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఒక ప్రధాన సర్వర్‌లో సమస్యలు తలెత్తడం ఈ ఏడాదిలో రెండో సారి కావడం విశేషం.శనివారం తెల్లవారు జామున 3:30 గంటలకు ఎయిర్‌లైన్స్‌కు చెందిన SITA సర్వర్ షట్ డౌన్ అయ్యిందని ఇది భారత్‌తో పాటు ఓవర్సీస్‌లో కూడా సమస్యలు సృష్టించిందని అధికారులు తెలిపారు. సర్వర్ల కారణంగా విమానాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలిసిన ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. మే 1 నుంచి ప్రయాణాలు రద్దు చేసుకోదలచిన ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకుంటే ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయమని అధికారులు చెప్పారు. అయితే ప్రయాణానికి ఏడు రోజుల ముందు టికెట్ బుక్ అయి ఉన్న వాటికే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది ఎయిరిండియా.

AirIndia services hit as servers Shutdown due to technical reasons

ప్రస్తుతం ఎయిరిండియా సాంకేతిక నిపుణులు దీని మరమత్తుల పనిలో ఉన్నారని త్వరలోనే సమస్యను పరిష్కరిస్తారని అధికారులు తెలిపారు. ప్రయాణికులకు కలిగిన ఇబ్బందికి తాము చింతిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది ఎయిరిండియా సంస్థ.అయితే సర్వీసులు పునఃప్రారంభంపై తమకు ఎలాంటి సమాచారం లేదని చాలామంది ప్రయాణికులు ట్విటర్ ద్వారా తెలిపారు.

English summary
Several passengers are stranded at the New Delhi's Indira Gandhi International Airport after Air India's main server suffered a shutdown globally. The flights have been affected with the technical snag across the world. This the second time in a year that the airline has been hit after its server shut down globally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X