వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమానం హైజాక్‌?? వెంటాడిన ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లు?

|
Google Oneindia TeluguNews

భారత గగనతలంలో అనేక నాటకీయ పరిణామాలు జ‌రిగాయి. మ‌న‌ గగనతలం మీదుగా ఎగురుతున్న ఇరాన్‌ విమానంలో బాంబు ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో ఉదయం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొంత స‌మ‌యం క‌ల‌క‌లం రేకెత్తింది. అధికారులు హుటాహుటిన విమానాశ్ర‌యానికి చేరుకొని ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఫైటర్‌ జెట్లు, అగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచారు.

ఇరాన్ లోని టెహ్రాన్‌ నుంచి చైనాలోని గ్వాంఘ్జుకు వెళ్తున్న మహన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో బాంబు ఉన్నట్లు లాహోర్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటీసీ) సిబ్బందికి ఫోన్ వ‌చ్చింది. వారు వెంట‌నే ఢిల్లీ ఎయిర్‌ ట్రాఫిక్ కంట్రోల్ కు స‌మాచారం అంద‌జేశారు. అత్య‌వ‌స‌రంగా ఢిల్లీ విమానాశ్ర‌యంలో ఆ విమానం ల్యాండ్ అవుతుందని అంచ‌నా వేశారు.

Airplane hijack??Haunted Indian Air Force fighter jets?

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన రెండు ఫైట‌ర్ జెట్ల‌ను సిద్ధంగా ఉంచారు. ఏదైనా అనుకోనిది త‌లెత్తితే అవి వెంటాడేందుకు సిద్ధ‌మ‌య్యాయి. కొంత స‌మ‌యం గ‌డిచిన త‌ర్వాత ఆ విమానం ఢిల్లీలోని విమానాశ్ర‌యంలో దిగ‌డంలేద‌ని తెలిసింది. చండీగ‌ఢ్ లో లేదంటే జైపూర్ లో దిగే అవ‌కాశం ఉంద‌ని భావించారు. ఈ రెండు న‌గ‌రాల్లో విమానాన్ని ల్యాండ్ చేయాల‌ని అధికారులు పైల‌ట్ల‌కు సూచించారు. అయితే వారు నిరాక‌రించారు. భార‌త గ‌గ‌న‌త‌లం వ‌దిలిపెట్టి చైనా గ‌గ‌న‌త‌లంలోకి వెళ్ల‌డంతోపాటు బాంబు బెదిరింపు కాల్ న‌కిలీద‌ని తేల‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు.

English summary
There have been many dramatic developments in Indian airspace.We have received information that there is a bomb on an Iranian plane flying over our airspace.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X