వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్:ఉచిత రోమింగ్, ఎస్ ఎం ఎస్ లకు ఎయిర్ టెల్ యోచన, జియోకు దెబ్బేనా?

రిలయన్స్ జియో ను పోటీని తట్టుకొనేందుకుగాను ఎయిర్ టెల్ తన టారిఫ్ లలో మార్పులు చేర్పులు చేయనుంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:రిలయన్స్ జియో దెబ్బకు ఇతర టెలికం కంపెనీలు కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకుగాను ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మేరకు ఎయిర్ టెల్ తమ కస్టమర్లకు ఎస్ ఎం ఎస్ లను ఉచితంగా అందించేందుకు గాను ప్రయత్నాలు చేస్తోంది.నేషనల్ డేటా రోమింగ్ పై ఎలాంటి అదనపు ప్రీమియం చార్జీలు విధించకుండా కస్టమర్లను తన వైపుకు తిప్పుకొనే ప్రయత్నాలను ప్రారంభించింది.

రిలయన్స్ జియో మార్కెట్లోకి ప్రవేశించడంతో ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ లు కూడ తమ కస్టమర్లు జియో వైపుకు మళ్ళకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు.అయినా జియో ఇచ్చిన ఉచిత ఆఫర్ తో ఇతర కంపెనీల కస్టమర్లు జియో వైపుకు మొగ్గుచూపారు.

రిలయన్స్ జియో ఈ ఏడాడి మార్చి వరకు ఉచితంగా వాయిస్ కాల్స్ ను, డేటాను అందంచనుంది. మార్చి తర్వాత కస్టమర్ల నుండి డబ్బులను వసూలు చేయనుంది. ఈ మేరకు జియో తన టారిఫ్ ప్లాన్లను వారం రోజుల క్రితం విడుదల చేసింది.

అయితే రిలయన్స్ జియో ఇస్తోన్న టారిఫ్ ప్లాన్ల కంటే తక్కువ టారిఫ్ ను కస్టమర్లకు అందించేందుకుగాను ఎయిర్ టెల్ ప్లాన్ చేస్తోంది.ఈ మేరకు ఎయిర్ టెల్ కూడ కొన్ని ప్లాన్స్ లో మార్పులు చేర్పులు చేస్తోంది.

ఉచిత రోమింగ్ సర్వీస్ ను ప్రకటించనున్న ఎయిర్ టెల్

ఉచిత రోమింగ్ సర్వీస్ ను ప్రకటించనున్న ఎయిర్ టెల్

రిలయన్స్ జియో అందిస్తోన్న టారిఫ్ కు అనుగుణంగా కస్టమర్లు జియో వైపుకు వెళ్ళకుండా తమ మైపుకు మళ్ళించేందుకుగాను ఎయిర్ టెల్ ప్లాన్ చేస్తోంది.దేశ వ్యాప్తంగా రోమింగ్ చార్జీలను ఎత్తివేయాలని ఎయిర్ టెల్ భావిస్తోంది. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో ఆ కంపెనీ ఈ మేరకు ప్రకటన చేసే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. జియో ప్లాన్ల ధాటికి తట్టుకొని నిలబడేందుకు గాను ఎయిర్ టెల్ ఈ రకమైన తన కస్టమర్లకు ఉచిత ప్లాన్లను ముందుకు తెస్తోంది. జియో తరహలోనే వాయిస్ కాల్స్, డేటా సేవలపై రోమింగ్ చార్జీలను ఎత్తివేసే అవకాశం ఉంది.

ఉచితంగా ఎస్ ఎం ఎస్ లు

ఉచితంగా ఎస్ ఎం ఎస్ లు

దేశ వ్యాప్తంగా ఎయిర్ టెల్ వినియోగదారులకు కంపెనీ ఇన్ కమింగ్ కాల్స్ , ఎస్ ఎం ఎస్ లపై ఉచిత రోమింగ్ సేవలు అందించనుంది, ఔట్ గోయింగ్ చార్జీలపై కూడ ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండబోవని ఎయిర్ టెల్ ఉద్యోగి ఒకరు జాతీయ మీడియాకు చెప్పారు.దీంతో పాటుగా యాక్టివేషన్ ను మరింత సరళతరం చేయనున్నారు. విదేశాలకు వెళ్ళే వినియోగదారులకు సైతం ధరలు అందుబాటులో ఉండేలా ప్రణాళికలను సిద్దం చేస్తోంది ఎయిర్ టెల్.

విదేశాల్లో ఉన్న వారికి కూడ ఎయిర్ టెల్ కొత్త ప్లాన్స్

విదేశాల్లో ఉన్న వారికి కూడ ఎయిర్ టెల్ కొత్త ప్లాన్స్

విదేశాలకు వెళ్ళే వినియోగదారులకు కూడ చౌకగా ఎయిర్ టెల్ తన టారిఫ్ ప్లాన్లలో మార్పులు చేర్పులు చేస్తోంది. ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ లను ఉపయోగించుకొనేలా ప్రోత్సహించేందుకుగాను ఈ నిర్ణయం తీసుకోనుంది.అయితే ఈ విషయమై త్వరలోనే ఎయిర్ టెల్ నుండి అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం లేకపోలేదు.

కొత్త ఆఫర్ తో 26.8 మందికి లబ్ది

కొత్త ఆఫర్ తో 26.8 మందికి లబ్ది

కొత్త తరహ టారిఫ్ ప్లాన్లను ఎయిర్ టెల్ అందుబాటులోకి తెస్తే దేశంలోని 26.8 కోట్ల మంది వినియోగదారులకు లబ్ది చేకూరనుంది.జియో ను తట్టుకొనేందుకుగా ను ఎయిర్ టెల్ ఈ తరహ ప్లాన్ ను అమలు చేస్తే వాటి ప్రభావం ఐడియా, వోడాఫోన్ లపై కూడ పడనుంది. గత ఏడాది అక్టోబర్ మాసం నుండి వోడాఫోన్ ఇన్ కమింగ్ కాల్స్ పై రోమింగ్ ఛార్జీలు ఎత్తివేసినప్పటికీ ఈ రెండు కంపెనీలపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం లేకపోలేదు.వోడాఫోన్ ఇన్ కమింగ్ కాల్స్ పై రోమింగ్ చార్జీలు ఎత్తివేసినప్పటికీ ఔట్ గోయింగ్ కాల్స్, డేటా సేవలపై రోమింగ్ చార్జీలను వసూలు చేస్తోంది.

ఈ తరహ టారిఫ్ లకు ఎయిర్ టెల్ ప్లాన్

ఈ తరహ టారిఫ్ లకు ఎయిర్ టెల్ ప్లాన్

2013 లో ఎయిర్ టెల్ ప్రవేశపెట్టిన ప్లాన్ లను తిరిగి ప్రవేశపెట్టేందుకుగాను యోచిస్తోంది ఎయిర్ టెల్. ప్రతి రోజు రూ.5 చెల్లించి ఉచితంగా ఇన్ కమింగ్, కాల్స్ ను ప్రవేశపెట్టేందుకు ఎయిర్ టెల్ యోచిస్తోంది. నెలకు రూ.79 వన్ టైం ప్యాక్ కింద ఉచిత రోమింగ్ ఇన్ కమింగ్ వాయిస్ సేవలను కూడ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. అయితే ఆ తర్వాత వీటిని రద్దు చేసి రూ.99 రీ చార్జీ ప్లాన్ లో ఫ్రీ ఇన్ కమింగ్ , ఎస్ ఎం ఎస్ కు 1.50( రోమింగ్) లను ప్రవేశపెట్టింది.

నాలుగేళ్ళలో లేని నష్టాల్లో ఎయిర్ టెల్

నాలుగేళ్ళలో లేని నష్టాల్లో ఎయిర్ టెల్

ఈ ఏడాది మూడవ క్వార్టర్ లో ఎయిర్ టెల్ లాభాలు 55 శాతం క్షీణించాయి.అంతేకాదు నాలుగేళ్ళలో ఏనాడు కూడ నమోదు చేయని విధంగా ఎయిర్ టెల్ భారీ నష్టాలను చవిచూసింది. ఈ నిర్ణయంతో భారతీ ఎయిర్ టెల్ ఆధాయం, షేర్ ధరలపై కొంత ప్రతికూల ప్రభావం చూసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. భారతీ ఎయిర్ టెల్ షేర్ ధర రూ.3.45 శాతం ప్రతికూలంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

జియో టారిఫ్ కు ధీటుగా ఎయిర్ టెల్ టారిఫ్ కు ఫ్లాన్

జియో టారిఫ్ కు ధీటుగా ఎయిర్ టెల్ టారిఫ్ కు ఫ్లాన్

ప్రస్తుతం ఎయిర్ టెల్ స్థానిక కాల్స్ కోసం నిమిషానికి రూ.80 పైసలు, ఎస్ టి డి కాల్స్ కు నిమిషానికి రూ.1.15 వసూలు చేస్తోంది. అదే విధంగా ఇన్ కమింగ్ కాల్ కోసం నిమిషానికి 45 పైసలు రోమింగ్ చార్జీలను వసూలు చేస్తోంది. అయితే జియో పోటీని తట్టుకొనే యోచనలో మరో టెలికం కంపెనీ వోడాఫోన్ దేశ వ్యాప్తంగా ఏడాది దీపావళి సందర్భంగా ఉచిత ఇన్ కమింగ్ కాల్స్ ను ప్రకటించింది. మరో వైపు ఎయిర్ టెల్ ఉచిత రోమింగ్ ఆఫర్ తో దేశ వ్యాప్తంగా రోమింగ్ చార్జీలు తగ్గింపుపై ఇతర దేశీయ టెలికం ఆపరేటర్లు దృష్టిపెట్టే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు.

English summary
India’s telecom major, Airtel may soon drop its roaming charges on its network for voice and data services, there would be no premium on outgoing calls and no additional data charges on national roaming.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X