వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్: అన్ లిమిటెడ్ కాల్స్.. రోజుకు 3జీబీ డేటా!

ఐఫోన్ వినియోగదారుల కోసం రిలయన్స్ జియో ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. జియోకు పోటీగా ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ కూడా తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఒక సంచలన ఆఫర్ తీసుకొచ్చింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: టెలికాం రంగంలో నెలకొన్న పోటీ వాతావరణం అల్టిమేట్ గా మొబైల్ వినియోగదారులకు వరాల జల్లు కురిపిస్తోంది. తాజాగా జియోకు పోటీగా ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

ఐఫోన్ వినియోగదారుల కోసం ఇటీవల రిలయన్స్ జియో ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో జియోకు పోటీగా ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ కూడా తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఒక సంచలన ఆఫర్ తీసుకొచ్చింది.

airtel

రూ. 799తో రోజుకు 3జీబీ డేటా, ఉచిత అపరిమిత కాల్స్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంటే రూ. 799తో రీఛార్జ్‌ చేసుకుంటే.. 28 రోజుల పాటు రోజుకు 3జీబీ డేటా వస్తుంది. ఉచితంగా అపరిమిత కాల్స్‌ చేసుకోవచ్చు.

ఇటీవల ఐఫోన్‌ 8, 8ప్లస్‌ ఫోన్లు భారత మార్కెట్లో విడుదలయ్యాయి. ఈ ఫోన్లపై జియో పలు ఆఫర్లు ప్రకటించింది. నెలకు రూ.799తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకు 3జీబీ డేటాతో పాటు ఉచిత కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లు ప్రకటించింది. దీంతో జియోకు పోటీగా ఎయిర్‌టెల్‌ కూడా ఇప్పుడు సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది.

జియో దెబ్బకు అన్ని టెలికాం సంస్థలు వినియోగదారులకు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్‌ రోజుకు 3జీబీ డేటా ఆఫర్‌ను అందిస్తోంది. ఎయిర్‌టెల్‌తో పాటు బీఎస్‌ఎన్‌ఎల్‌, వొడాఫోన్‌, ఐడియా లాంటి సంస్థలు కూడా అందుబాటు ధరల్లో డేటా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

English summary
Less than a week after Jio announced an exclusive plan for iPhone users, Airtel has launched a similar plan with 84GB of bundled data. The new Airtel Rs. 799 plan is available only for prepaid users, and comes with unlimited STD and local calls, and validity of 28 days. This plan is in direct competition with the aforementioned Jio Rs. 799 pack that is only provided to iPhone users and comes with 3GB of daily data allowance, as well as free calls and SMSes and Jio apps subscription. This is the latest skirmish between the market leader and the telecom upstart that launched operations a year ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X