వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియో‌కు షాక్: రూ.1799, 1899లకే 4జీ ఎయిర్‌టెల్ 4జీ స్మార్ట్‌పోన్స్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జియోకు పోటీగా ఎయిర్‌టెల్ కూడ కొత్త కొత్త ఆఫర్లతో ముందుకు వస్తోంది. జియో మార్కెట్లోకి విడుదల చేసిన ఫీచర్ ఫోన్‌కు దాదాపుగా సమానమైన ధరలో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తున్నట్టు ఎయిర్‌టెల్ ప్రకటించింది.

శుభవార్త: కిరాణ మార్కెట్లోకి ముఖేష్ అంబానీ, జియో కష్టమర్లకు డిస్కౌంట్శుభవార్త: కిరాణ మార్కెట్లోకి ముఖేష్ అంబానీ, జియో కష్టమర్లకు డిస్కౌంట్

జియో మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత ఎయిర్‌టెల్ కూడ కొత్త కొత్త ఆఫర్లతో ముందుకు వస్తోంది. జియో ఫీచర్ ఫోన్ ప్రవేశపెట్టిన తర్వాత అదే ధరకు స్మార్ట్‌పోన్‌ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది ఎయిర్ టెల్,

జియో శుభవార్త: తక్కువ ధరకే 4జీ స్మార్ట్‌ఫోన్‌జియో శుభవార్త: తక్కువ ధరకే 4జీ స్మార్ట్‌ఫోన్‌

ఎయిర్‌టెల్ తరహలోనే ఇతర టెలికం కంపెనీలు కూడ టారిఫ్ ప్లాన్లను మార్చడమే కాదు కొత్త కొత్త స్కీమ్‌లతో మార్కెట్లోకి వస్తున్నాయి.టెలికం కంపెనీల మధ్య పోటీ వినియోగదారులకు ప్రయోజనంగా మారుతోంది.

జియో బంపర్ ఆఫర్: ఐఫోన్ 10ఎక్స్‌పై 70% క్యాష్‌బ్యాక్జియో బంపర్ ఆఫర్: ఐఫోన్ 10ఎక్స్‌పై 70% క్యాష్‌బ్యాక్

ఎయిర్‌టెల్ 4జీ స్మార్ట్ ఫోన్

ఎయిర్‌టెల్ 4జీ స్మార్ట్ ఫోన్

ఎయిర్‌టెల్‌ మరో రెండు కొత్త ఆండ్రాయిడ్‌ ఆధారిత 4జీ స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. హ్యాండ్‌సెట్‌ తయారీదారి కార్బన్‌ మొబైల్స్‌ భాగస్వామ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తున్నట్టు తెలిపింది. ''ఏ1 ఇండియన్‌‌'', ''ఏ41 పవర్‌'' పేర్లతో ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను ఫీచర్‌ ఫోన్‌ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చింది.జియో విడుదల చేసిన ఫీచర్‌ ఫోన్‌కు సమానంలోనే ఎయిర్‌టెల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది.

రూ. 1799 4జీ స్మార్ట్‌ఫోన్

రూ. 1799 4జీ స్మార్ట్‌ఫోన్

ఏ1 ఇండియన్‌ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.1,799కు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. దీని గరిష్ట చిల్లర ధర 4,390 రూపాయలు. ఏ41 పవర్‌ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను 1,849 రూపాయలకు మాత్రమే మార్కెట్లో విక్రయించాలని ఎయిర్ టెల్ నిర్ణయం తీసుకొంది. దీని 'ధర కూడా 4,290 రూపాయలు. జియో ఫీచర్‌ ఫోన్‌కు గట్టి పోటీగా ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను రెండు వేల రూపాయల తక్కువకు మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది.

అమెజాన్ ఇండియాలో లభ్యం

అమెజాన్ ఇండియాలో లభ్యం

ప్రతి భారతీయుడు 4జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసి, డిజిటల్‌ సూపర్‌హైవేలో పాలు పంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు పేర్కొంది. ఎయిర్‌టెల్‌-కార్బన్‌ భాగస్వామ్యం కింద అందుబాటులోకి వచ్చే అన్ని డివైజ్‌లు అమెజాన్‌ ఇండియాలో కూడా లభ్యంకానున్నాయి. ''మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్'' కింద తాము తీసుకొచ్చిన తొలి ఆఫర్‌కు మంచి డిమాండ్‌ ఉందని భారతీ ఎయిర్‌టెల్‌ సీఎంఓ డైరెక్టర్‌-కన్జ్యూమర్‌ బిజినెస్‌ రాజ్‌ పుడిపెడ్డి తెలిపారు.

పోటాపోటీ ఆఫర్లు

పోటాపోటీ ఆఫర్లు

జియో ఆఫర్ల కారణంగా ఇతర టెలికం కంపెనీలు కూడ ఆఫర్లను తీసుకురావాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. జియో ఫీచర్ పోన్ కు పోటీగా ఎయిర్‌టెల్ ఈ ఆఫర్‌ను తెచ్చింది. అంతేకాదు ఐడియా కూడ ఇదే తరహలో ఫోన్ ను తీసుకురానున్నట్టుగా కూడ ప్రచారం సాగుతోంది. అయితే జియో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను కూడ అందుబాటులోకి తీసుకురానుంది . ఈ మేరకు చైనా కంపెనీతో ఒప్పందం చేసుకొంది.

English summary
Airtel and Karbonn are continuing with their partnership with the launch of two new 4G smartphones in India. The telecom operator and the Indian smartphone manufacturer announced the A1 Indian and A41 Power. The Android-powered 4G smartphones carry an ‘effective price’ of Rs 1,799 and Rs 1,849, while their MRP is Rs 4,390 and Rs 4,290, respectively. The A1 Indian will be available on Amazon India starting today, while the A41 Power will be available from next week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X