వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియోకు షాక్: 3 నెలల పాటు 30 జీబీ ఉచిత డేటా ప్రకటించిన ఎయిర్ టెల్

ఎయిర్ టెల్ తన పోస్ట్ పెయిడ్ కస్టమర్ల కోసం 30 జీబీ ఉచిత డేటాను ఇవ్వనున్నట్టుగా ప్రకటించింది. మార్చి 13 నుండి ఈ ఉచిత డేటా అందుబాటులోకి తీసుకువచ్చినట్టు ఎయిర్ టెల్ ప్రకటించింది. సర్ ప్రైజ్ ఆఫర్ ను 30 జీబ

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై:టెలికం కంపెనీల మద్య పోటీ తీవ్రమైంది. రిలయన్స్ జియో ప్రవేశపెట్టిన ఉచిత ఆఫర్ ను ధీటుగా ఎదుర్కొనేందకుగాను ఇతర టెలికం కంపెనీలు కూడ ఉచిత ఆఫర్లను ముందుకు తెచ్చాయి.అంతే కాదు రిలయన్స్ కు చెక్ పెట్టేందుకుగాను ఇతర టెలికం కంపెనీలు తమ టారిఫ్ ప్లాన్ లను మార్చాయి.

రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో ఇతర టెలికం కంపెనీలు తమ కస్టమర్లను కాపాడుకొనే ప్రయత్నాలను ప్రారంభించాయి.తమ కస్టమర్లు జియో వైపుకు వెళ్ళకుండా అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

ఉచిత వాయిస్ ,ఉచిత డేటాతో రిలయన్స్ జియో ఇతర టెలికం కంపెనీల కంటే తక్కువ సమయంలోనే ఎక్కువమంది కస్టమర్లను సంపాదించుకొంది.అయితే ఏప్రిల్ నుండి జియో సేవలు పొందాలంటే డబ్బులు చెల్లించాల్సిందే.

మార్చి 31 వ, తేది వరకు జియో సేవలను ఉచితంగా పొందే అవకాశం ఉంది.అయితే ఈ తరుణంలోనే జియో వైపుకు తమ కస్టమర్లు తరలివెళ్ళకుండా ఉండేందుకుగాను ఇతర టెలికం కంపెనీలు కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

సర్ ప్రైజ్ ఆఫర్ ను ప్రకటించిన ఎయిర్ టెల్

సర్ ప్రైజ్ ఆఫర్ ను ప్రకటించిన ఎయిర్ టెల్

ఎయిర్ టెల్ కంపెనీ తన సర్ ప్రైజ్ ఆఫర్ ను ప్రకటించింది. ఇటీవలనే ఈ ఆఫర్ ను ప్రకటించనున్నట్టుగా ఎయిర్ టెల్ ప్రకటించింది. అయితే సర్ ప్రైజ్ ఆఫర్ గురించి ఎయిర్ టెల్ కస్టమర్లు ఉత్కంఠగా ఎదురుచూశారు.అయితే తన సర్ ప్రైజ్ ఆఫర్ ను ఎయిర్ టెల్ మంగళవారం నాడు ప్రకటించింది.ఎయిర్ టెల్ పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు 30 జీబీ ఉచిత డేటాను మూడు మాసాల పాటు ఉచితంగా ఇవ్వనున్నట్టు ఎయిర్ టెల్ ప్రకటించింది.మార్చి 13వ, తేది నుండి ఈ ఉచిత డేటా సౌకర్యాన్ని పొందే అవకాశం ఉంటుందని ఎయిర్ టెల్ ప్రకటించింది.

ప్రతి నెల 10 జీబీ ఉచిత డేటా

ప్రతి నెల 10 జీబీ ఉచిత డేటా

మూడు మసాల పాటు తమ పోస్ట్ పెయిడ్ వినియోగదారులు 30 జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చని ఎయిర్ టెల్ ప్రకటించింది.అయితే ప్రతి నెల 10 జీబీ మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.అయితే ఉచిత డేటాను పొందాలంటే మార్చి 31వ, తేదిలోపుగా ఈ విషయాన్ని ఎయిర్ టెల్ కు తెలపాల్సి ఉంటుంది. ఉచిత డేటాను కస్టమర్లు క్లైయిమ్ చేసుకోవాల్సి ఉంటుందని ఎయిర్ టెల్ ప్రకటించింది.

మై ఎయిర్ టెల్ యాప్ డౌన్ లోడ్ చేసుకొంటేనే ఉచిత డేటా

మై ఎయిర్ టెల్ యాప్ డౌన్ లోడ్ చేసుకొంటేనే ఉచిత డేటా

గూగుల్ ప్లే స్టోర్ నుండి మై ఎయిర్ టెల్ యాప్ ను ఉచిత డేటాను పొందాల్సిన కస్టమర్లు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.గూగుల్ ప్లే స్టోర్ కాకుంటే యాప్ ప్లోర్ నుండి కూడ ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.త్వరలోనే సర్ ప్రైజ్ ఆఫర్ తో కస్టమర్ల ముందుకు రాబోతున్నట్టు ఎయిర్ టెల్ ఇటీవలే ప్రకటించింది.అయితే దీనికి సంబందించి అధికారికంగా ఎయిర్ టెల్ మంగళవారం నాడు ప్రకటన విడుదల చేసింది.

 ఎయిర్ టెల్ ఉచిత డేటా ఇలా పొందే అవకాశం

ఎయిర్ టెల్ ఉచిత డేటా ఇలా పొందే అవకాశం

ఎయిర్ టెల్ కస్టమర్లు పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు 30 జీబీని ఉచితంగా డేటాను ఉపయోగించుకొనే అవకాశం కల్పించింది.అయితే మై ఎయిర్ టెల్ యాప్ లో సర్ ప్రైజ్ ఆఫర్ ను క్లైయిమ్ చేసుకొనేందుకుగాను ప్రమోటింగ్ యాజర్లకు ఈ యాప్ లో ఓ డైలాగ్ బాక్స్ చూపించనుంది.దీన్ని క్లిక్ చేస్తే ఉచిత డేటా సేవలు అందుబాటులోకి వస్తాయి. అదనపు డేటా సౌకర్యాలు కూడ టెక్ట్స్ మేసేజ్ ద్వారా కంపెనీ యూజర్లకు తెలుపుతోంది.కొత్త ప్రీపెయిడ్ రీ చార్జ్ ప్యాక్ ను ఆవిష్కరించిన కొన్ని రోజులకే ఈ టెలికం దిగ్గజం సర్ ప్రైజ్ ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది.

రూ.549 రీ చార్జీతో రోజుకు 1 జీబీ ఉచిత డేటా

రూ.549 రీ చార్జీతో రోజుకు 1 జీబీ ఉచిత డేటా

ఎయిర్ టెల్ కస్టమర్లు రూ.549 రీ చార్జీ చేసుకొంటే ప్రతి రోజు 1 జీబీ డేటాను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.దీనికి ఎలాంటి పరిమితులుండవు.ప్రస్తుతం ప్రీపెయిడ్ కస్టమర్లు రూ.345 ప్లాన్ తో రోజుకు 4 జీబీ డేటాను వాడుకొనే అవకాశం కల్పిస్తోంది.అయితే పగలంతా 500 ఎంబీ డేటాను వాడుకొన్న తర్వాత రాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటలలోపుగా ఉపయోగించుకోవాలి.

English summary
A week after teasing postpaid customers with a surprise coming their way, Airtel has provided them with 30GB of free data under its Airtel Surprise offer. The free data will be provided for a period of three months, starting March 13.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X