వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియోకు షాక్: ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్ రూ.999 రీ ఛార్జీ, 122 జీబీ డేటా, ఉచిత కాల్స్

కొత్త ఆఫర్లతో ఎయిర్‌టెల్ ముందుకు వచ్చింది.టెలికం మార్కెట్‌లో ఆఫర్ల యుద్ధం వెల్లువెత్తుతోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కొత్త ఆఫర్లతో ఎయిర్‌టెల్ ముందుకు వచ్చింది.టెలికం మార్కెట్‌లో ఆఫర్ల యుద్ధం వెల్లువెత్తుతోంది. భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా సెల్యులార్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ కంపెనీలు అదనపు డేటా ఆఫర్లు, కొత్త రీఛార్జ్‌ ప్లాన్లతో హోర్రెత్తికిస్తున్నాయి.

తాజాగా దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌ అయిన భారతీ ఎయిర్‌టెల్‌ కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ రూ.999ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్‌ కింద రోజుకు 4జీబీ 3జీ/4జీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది.

Airtel rolls out Rs 999 recharge with 122 GB data, free calls

ఈ ప్రీ పెయిడ్‌ రీఛార్జ్‌ ఆఫర్‌ 28 రోజుల పాటు వాలిడ్‌లో ఉంటుందని, దీని కింద ఉచిత వాయిస్‌ కాల్స్‌ను కూడా అందించనున్నట్టు పేర్కొంది. అంటే 28 రోజుల్లో 122జీబీని ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ కస్టమర్లు పొందుతారు.

ముఖేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి టెలికాం సెక్టార్‌లో ఈ డేటా యుద్ధం నెలకొంది. రిలయన్స్‌ జియో రూ.999 ప్లాన్‌కు పోటీగా ఎయిర్‌టెల్‌ ఈ ఆఫర్‌ తీసుకొచ్చింది.

జియో రూ.999 రీఛార్జ్‌ కింద 90జీబీ 4జీ డేటాను మాత్రమే ఆఫర్‌ చేస్తోంది. అయితే 90 రోజుల పాటు ఆఫర్‌ చేస్తోంది. ఒకవేళ 90జీబీ డేటా వాడకం అయినపోయిన తర్వాత స్పీడు 128 కేబీపీఎస్‌కు పడిపోతుంది. ఆ ప్లాన్‌ జియో ప్రీపెయిడ్‌, పోస్టుపెయిడ్‌ యూజర్లందరికీ అందుబాటులో ఉంది. తాజాగా జియో తన రూ.149 ప్లాన్‌ను అప్‌డేట్‌ చేసింది.

English summary
In a bid to retain their subscribers in a highly competitive market, Bharti Airtel and other telecom incumbents – Vodafone, Idea cellular and BSNL – have been offering additional data offers, new recharge plans and other benefits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X