వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: లక్ష టెలికం ఉద్యోగాల కోత, పింక్ స్లిప్‌లు రెఢీ?

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: టెలికం రంగంలో ఉద్యోగులు సంఖ్య భారీగా తగ్గిపోతోంది టెలికం రంగంలో చోటుచేసుకొంటున్న పరిణామాలతో ఆయా కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకొనే పనిలో పడ్డాయి. ఈ పరిణామాలు ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి.

భారతీ ఎయిర్‌టెల్‌లో గతేడాది కంటే ఈ ఏడాదికి ఉద్యోగులు 1,805 మంది తగ్గిపోయారు. గతేడాది సెప్టెంబర్‌లో 19,462గా ఉన్న ఎయిర్‌టెల్‌ ఉద్యోగుల సంఖ్య, ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి 17,657గా ఉంది. ఈ క్రమంలో ఒక్కో ఉద్యోగికి ఉన్న కస్టమర్లు 16,960కి పెరిగారు. గతేడాది ఈ సంఖ్య 14,189గా ఉంది. ఒక్కో నెలలో ఒక్కో ఉద్యోగి రెవెన్యూ 4.1 శాతం తగ్గిపోయింది. ఒక్కో ఉద్యోగి రెవిన్యూ రూ.31.5 లక్షలుగా నమోదైంది. టెలికాం ఆపరేటర్ల మధ్య తీవ్ర పోటీ వాతావరణం నెలకొనడంతో, లాభాలు భారీగా తగ్గిపోతున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Recommended Video

BSNL Launch New Plan To Take On Reliance Jio, Check Out Details | Oneindia Telugu
Airtel staff count shrinks by 1,805; 100,000 telecom jobs at risk

మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో టెలికం కంపెనీలు చాలామంది ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌లు ఇస్తున్నాయి. పరోక్ష ఉద్యోగాలతో పోలిస్తే మొత్తం లక్ష టెలికం ఉద్యోగాలు రానున్న రోజుల్లో ప్రమాదంలో పడే అవకాశాలున్నాయని నిపుణులు అంచనావేస్తున్నారు.. భారత్‌లోనే కాక ఆఫ్రికాలో కూడా ఎయిర్‌టెల్‌ తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆఫ్రికాలో కంపెనీ ఉద్యోగులు 321 మంది తగ్గిపోయారు. ఏడాది క్రితం ఆఫ్రికాలో 4,058 మంది ఉద్యోగులుండేవారు. ప్రస్తుత ఏడాది సెప్టెంబర్‌కి 3,737 గా ఉన్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

English summary
Bharti Airtel has pruned its workforce in the last one year and the company is leaner by 1,805 employees in India. The total employees of the country's top operator stood at 17,657 at the end of September, 2017 as against 19,462 on September 30 last year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X