వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐశ్వర్య రాయ్‌కు అత్తింటి వేధింపులు.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఐశ్వర్య రాయ్ అనే యువతిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఐశ్వర్య రాయ్‌కు అత్తింటి వారి వేధింపులు ప్రారంభమయ్యాయని సమాచారం. తాజాగా ఐశ్వర్య రాయ్ తన అత్త బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవీ తనను వేధింపులకు గురిచేసిందని స్వయంగా చెప్పారు. తన జుట్టును పట్టుకుని ఈడ్చుకెళ్లిందని చెప్పుకొచ్చారు. తన ఫోన్‌ను గుంజుకుని బయటకు తోసేసిందని ఐశ్వర్య చెప్పారు.

ఘనంగా పెళ్లి! కన్నీటితో పుట్టింటికి ఐశ్వర్య: తేజ్ ప్రతాప్ డ్రగ్స్ బానిస, వింత ప్రవర్తన, విడాకులు!ఘనంగా పెళ్లి! కన్నీటితో పుట్టింటికి ఐశ్వర్య: తేజ్ ప్రతాప్ డ్రగ్స్ బానిస, వింత ప్రవర్తన, విడాకులు!

రబ్రీదేవీ మొదటి నుంచి అమానుషంగా ప్రవర్తించేది

రబ్రీదేవీ మొదటి నుంచి అమానుషంగా ప్రవర్తించేది

తాను ఒకరోజు ఇంట్లో టీవీ చూస్తుండగా తన మాజీ భర్త తేజ్‌ప్రతాప్ యాదవ్ స్నేహితులు పాట్నా యూనివర్శిటీలో తన గురించి తన తల్లిదండ్రుల గురించి అసభ్యకరమైన పోస్టర్లను అంటించారని తన మొబైల్‌కు మెసేజ్ వచ్చినట్లు మీడియాకు చెప్పారు ఐశ్వర్య. ఇది చాలా తప్పని చెబుతూ తన అత్త రబ్రీదేవీ దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పింది. తన కుటుంబం పరువును తేజ్ ప్రతాప్ రోడ్డున పెడుతున్నాడని అత్త రబ్రీదేవీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ రొంపిలోకి తన తల్లిదండ్రులను తీసుకురావడం సరికాదని చెప్పినట్లు ఐశ్వర్య చెప్పింది.

మహిళా సెక్యూరిటీ సైతం నాపై చేయి చేసుకుంది

మహిళా సెక్యూరిటీ సైతం నాపై చేయి చేసుకుంది

ఫిర్యాదు చేయగా తనపైనే రబ్రీ దేవీ ఆగ్రహం వ్యక్తం చేసిందని ఐశ్వర్య చెప్పింది. తనపై పరుషపదజాలంను వినియోగించిందని చెప్పింది. ఇక రబ్రీదేవీకి ఉన్న మహిళా సెక్యూరిటీ గార్డులు తనపై చేయిచేసుకున్నారని చెప్పారు. తల, మోకాళ్లు కాళ్లపై వారు కొట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత తనను జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చారని చెప్పింది. వారు చేస్తున్న తంతును తాను తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేయగా దాన్ని తీసేకుని తనను బయటకు ఈడ్చారని చెప్పారు ఐశ్వర్య.

 మొత్తం కుటుంబ సభ్యులు నాపై దాడి చేశారు

మొత్తం కుటుంబ సభ్యులు నాపై దాడి చేశారు

తాము చేసిన అరాచకాలు బయటపడకుండా ఉండేందుకు ఉన్న ఒకే ఒక ఆధారాన్ని డిలీట్ చేసి ఉంటారని చెప్పారు.2018లో తేజ్ ప్రతాప్‌తో ఐశ్వర్యకు వివాహం కాగా ఆరు నెలలకే ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసింది. మొత్తం యాదవ్ కుటుంబమంతా జైలులో ఉండాలని మండిపడ్డారు ఐశ్వర్య కుటుంబ సభ్యులు. ముందుగా కేవలం తన అల్లుడితోనే సమస్య ఉందని భావించామని కానీ ఇప్పుడు మొత్తం కుటుంబ సభ్యులతోనే సమస్యగా ఉందని చెప్పారు. ఇలా ఐశ్వర్యను ఇంటినుంచి బయటకు పంపడం ఇది తొలిసారి కాదని ఒకసారి భారీ వర్షం పడుతున్న సమయంలో కూడా ఆమెను బయటకు ఈడ్చారని తల్లిదండ్రులు చెప్పారు.

పోలీసులకు ఫిర్యాదు చేసిన ఐశ్వర్య రాయ్

పోలీసులకు ఫిర్యాదు చేసిన ఐశ్వర్య రాయ్


ఇదిలా ఉంటే రబ్రీదేవీపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఐశ్వర్య కోరింది. అయితే ఐశ్వర్య షాక్‌లో ఉందని పరిస్థితి కాస్త శాంతించాక ఆమె స్టేట్‌మెంట్ రికార్డు చేస్తామని పోలీసులు చెప్పారు. ఎఫ్‌ఐఆర్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న సంగతి తెలుసుకున్న తేజ్‌ప్రతాప్ యాదవ్ మద్దతు దారులు ఐశ్వర్య ఇంటిముందుకు చేరి నిరసనలు తెలిపారు. పెళ్లి ద్వారా వారికి కావాల్సిన లబ్ధి చేకూరకపోవడంతోనే తేజ్ ప్రతాప్ యాదవ్ పరువును తీస్తున్నారని వారు ఆరోపించారు. ఇదిలా ఉంటే లాలూ ప్రసాద్ యాదవ్‌కు తానేంటో చూపిస్తానని ఐశ్వర్య తంగ్రి చంద్రికా రాయ్ చెప్పారు. తన మద్దతే లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ ఇలా ఉండేవారు కాదని చెప్పారు. వీరందరిపై రాజకీయంగాను , సామాజికంగాను పోరాటం చేస్తానని చెప్పారు చంద్రికా రాయ్.

English summary
Lalu Prasad Yadav's daughter-in-law Aishwarya Rai accused mother-in-law Rabri Devi of beating her up and throwing her out of the house. Rai's father said that the situation has reached a point of no return
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X