వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌కు అమెరికా సాయం చేసిందా: దాడులు చేస్తున్నట్లు దోవల్ ముందస్తు సమాచారమిచ్చారా..?

|
Google Oneindia TeluguNews

పాకిస్తాన్‌పై మంగళవారం తెల్లవారుజామున భారత వైమానిక దళం దాడులు చేసిన సంగతి తెలిసిందే. పుల్వామా దాడులకు ప్రతీకార చర్యలో భాగంగానే భారత్ రియాక్ట్ అయ్యింది. పాకిస్తాన్ పై దాడుల సంగతి గురించి ముందుగానే అమెరికా జాతీయ భద్రతాధికారి జాన్ బోల్టన్‌తో భారత జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ చర్చించినట్లు సమాచారం. ఫిబ్రవరి 16వ తేదీన ఫోన్ చేసిన సమయంలో దాడులపై ఇరు దేశాధికారులు చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఏ మాత్రం మారని పాక్ .. ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటనఏ మాత్రం మారని పాక్ .. ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటన

భారత్ ఎలాంటి దాడులు చేయనుందో అనే అంశంపై అమెరికాతో అజిత్ దోవల్ పంచుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. బాలాకోట్‌‌లో దాడులు జరుపుతామని ముందుగానే సమాచారాన్ని జాన్ బోల్టన్‌తో పంచుకున్నారు. ఇక ప్లాన్‌లో ఎలాంటి మార్పులేకుండా భారత వాయుసేన అమలు చేసింది. మొత్తం 21 నిమిషాల్లో ఆపరేషన్‌ను పూర్తి చేసి తిరిగి భారత భూభాగం పైకి చేరుకుంది. ఈ ఆపరేషన్‌లో 300 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు సమాచారం. ఇందులో చాలామంది ఆత్మాహుతి బాంబర్లుగా శిక్షణ పొందుతున్నారు. అమెరికా నుంచి భారత్‌కు పాక్‌ పై దాడుల విషయంలో పూర్తి మద్దతు ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను ద్వంసం చేయాడాన్ని ప్రపంచదేశాలు భారత్‌కు అభినందనలు తెలుపుతున్నాయని సమాచారం.

Ajit Doval had discussed Balakot strike with US NSA John Bolton on 16 February

ఫిబ్రవరి 16 తర్వాత బోల్టన్ రెండు సార్లు దోవల్‌తో మాట్లాడినట్లు సమాచారం. భారత్‌ దాడులు చేయడం సరైన నిర్ణయమే అని జాన్ దోవల్‌తో చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మరోవైపు పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని చెప్పిన బోల్టన్ టెరరిస్టులకు నీడ ఇవ్వడం పాక్ మానుకోవాలని అన్నారు. ఇదిలా ఉంటే భారత్ గట్టిగానే జవాబు ఇస్తుందని తాను భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు పుల్వామా ఉగ్రదాడుల తర్వాత వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే పాకిస్తాన్‌లో భారతవాయుసేన చేసిన దాడులపై అమెరికా కూడా సహకరించిం ఉంటుందనే అనుమానం వ్యక్తం చేశారు జేఎన్‌యూ ప్రొఫెసర్ హ్యాపీమాన్ జేకబ్. లక్ష్యాల గురించి, ఏ సమయంలో ఎక్కడ ఎలాంటి దాడి చేయాలనే ఇంటెలిజెన్స్ సమాచారం భారత్‌కు అమెరికా ఇచ్చి ఉంటుందనే అనుమానం ఆయన వ్యక్తం చేశారు.

English summary
The pre-emptive strike by the Indian Air Force early Tuesday in Pakistan’s Balakot was discussed by Ajit Doval and John Bolton, the national security advisers of India and the US, during a phone call on 16 February, a top diplomatic source told a news agency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X