వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా ఎఫెక్ట్: మైక్ పాంపియో, ఎస్పర్‌లతో అజిత్ దోవల్ ‘ఎల్బో బంప్’

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచ ప్రజల జీవన విధానాన్నే మార్చేసింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆ మహమ్మారికి దూరంగా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు స్వీయ రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా, పరిణామం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

భారత పర్యటనలో ఉన్న అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రెండు మోచేతులను అనించుకుని పలకరించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. డిఫెన్స్ సెక్రటరీ మార్క్ టి ఎస్పర్‌ను కూడా అజిత్ దోవల్ ఇదే విధంగా పలకరించారు. ఈ సరికొత్త 'ఎల్బో బంప్' ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

 Ajit Dovals Elbow Bump With Mike Pompeo, US Defense Secretary esper

కరోనా నిబంధనలు పాటిస్తూ ఢిల్లీలో భారత్, అమెరికాకు చెందిన నేతలు, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. అందరూ మాస్కులు ధరించే కనిపించారు. మైక్ పాంపియో అమెరికా జాతీయ జెండాను పోలిన మాస్కును ధరించారు. భారత్-చైనాల మధ్య సరిహద్దు వివాదం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్-అమెరికాల కీలక చర్చలు, ఒప్పందాలు జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అంతేగాక, ఈ చర్చల సందర్భంగా మైక్ పాంపియో.. చైనా వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము భారత్‌కు అండగా ఉంటామని అన్నారు. చైనా దుందుడుకు వ్యవహార శైలిని తగ్గించుకుంటే మంచిదని హితవు పలికారు. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.

English summary
National Security Advisor Ajit Doval exchanged elbow bumps, skipping the conventional handshake, with US Secretary of State Mike Pompeo and Defence Secretary Mark T Esper today in Delhi, following social distancing norms amid the coronavirus pandemic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X