వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛత్తీస్‌గఢ్ తొలి ముఖ్యమంత్రి అజిత్ జోగి కన్నుమూత

|
Google Oneindia TeluguNews

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ వ్యవస్థాపకుడు అజిత్ జోగి(74) కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అస్వస్థతో బాధపడుతున్న ఆయన రాయ్‌పూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

అజిత్ జోగి మరణ వార్తను ఆయన తనయుడు అమిత్ జోగి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 1946 ఏప్రిల్ 29న బిలాస్పూర్‌లో జన్మించారు అజిత్ జోగి. ఆయన బోపాల్‌లోని మౌలానా ఆజాద్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు.

 Ajit Jogi, first chief minister of Chhattisgarh, dies at 74

రాజకీయాలకంటే ముందు ఐఏఎస్‌కు ఎంపికైన అజిత్ జోగి మధ్యప్రదేశ్‌లోని భోపాల్, ఇండోర్ జిల్లాలకు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2000 సంవత్సరంలో ఏర్పడిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి ఆయన తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు అజిత్ జోగి. 2016లో కాంగ్రెస్ విభేదాల నేపథ్యంలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ పార్టీని స్థాపించారు. గతంలో రోడ్డు ప్రమాదానికి గురికావడంతో తీవ్రంగా గాయపడ్డారు అజిత్ జోగి. ఆ తర్వాత వీల్ ఛైర్ నుంచే రాజకీయాలను కొనసాగించారు. అజిత్ జోగి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు.

Recommended Video

Aurangabad : Goods Train Runs Over Chhattisgarh Labourers In Maharashtra

English summary
Ajit Jogi, the first chief minister of Chhattisgarh, breathed his last on Friday. The announcement of his demise was made by his son Amit Jogi who took to Twitter at 3:35 pm and in a post said, "Not only me but Chhattisgarh has lost his father.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X