వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహా ట్విస్టులు: మళ్లీ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్! శరద్ పవార్‌తో భేటీ తర్వాత మారిన సీన్

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు మలుపుల మీద మలుపులు తిరుగుతున్నాయి. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి అవుతారనుకుంటే.. గత శనివారం బీజేపీ అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి సంచలనం సృష్టించారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ డిప్యటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత మరిన్ని మలుపులు తిరిగాయి.

80 గంటలు సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ రికార్డ్: అత్యల్ప కాలం సీఎంగా చేసింది వీరే80 గంటలు సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ రికార్డ్: అత్యల్ప కాలం సీఎంగా చేసింది వీరే

నిన్ననే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా..

నిన్ననే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా..

మంగళవారం ఉదయం డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ రాజీనామా చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. దీంతో బీజేపీ ప్రభుత్వం మూడు రోజులకే ముగిసిపోయినట్లయింది. ఆ తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వద్దకు అజిత్ పవార్ చేరిపోవడం గమనార్హం.

మళ్లీ డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్

మళ్లీ డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్


ఈ నేపథ్యంలో మరో కొత్త రాజకీయ మలుపు చోటు చేసుకుంది. ఎన్సీపీలో తిరిగి చేరిన అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టేందుకు ఎన్సీపీ నేతలు నిర్ణయించినట్లు తెలిసింది. అంతేగాక, ఆయనకు ఎన్సీపీ పక్ష నేత పదవిని కూడా తిరిగి ఇచ్చేందుకు పార్టీ నేతలు సుముఖంగా ఉండటం గమనార్హం. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.

శరద్ పవార్‌తో భేటీ తర్వాత మారిన సీన్

శరద్ పవార్‌తో భేటీ తర్వాత మారిన సీన్


ఇప్పటి వరకు ఎన్సీపీ నేత జయంత్ పాటిల్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే మంగళవారం రాత్రి అజిత్ పవార్.. శరద్ పవార్‌తో భేటీ అయిన తర్వాత సమీకరణలు మారిపోయాయి. అజిత్ పవార్.. శరద్ పవార్ సోదరుడి కుమారుడే కావడంతోపాటు ఎన్సీపీలో రెండో కీలక నేతగా ఉండటంతో ఆయనకే డిప్యూటీ సీఎం కట్టబెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఎన్సీపీలో కీలక నేతగా అజిత్ పవార్..

ఎన్సీపీలో కీలక నేతగా అజిత్ పవార్..

బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించినప్పటికీ.. వెంటనే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్సీపీలోకి రావాలంటూ ఆ పార్టీ నేతలతోపాటు పవార్ కుటుంబసభ్యులు కూడా అజిత్ పవార్‌ను కోరారు. ఈ క్రమంలోనే అజిత్ పవార్ తిరిగి పార్టీలోకి రావడంతో పవార్ కుటుంబంతోపాటు ఎన్సీపీ నేతలు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ అజిత్ పవార్‌కు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తగిన ప్రాధాన్యం ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఉద్ధవ్ తోపాటు డిప్యూటీ సీఎంగా?

ఉద్ధవ్ తోపాటు డిప్యూటీ సీఎంగా?


నవంబర్ 28న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఆయనతోపాటే అజిత్ పవార్ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసే అవకాశాలున్నాయి. ఇక కాంగ్రెస్ నుంచి మరో అభ్యర్థి మరో డిప్యూటీ సీఎం పదవి చేపట్టే అవకాశాలున్నాయి.

English summary
Ajit Pawar chances to take oath as Deputy CM Of Maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X