వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అజిత్, శరద్ పవార్ ల ట్వీట్ వార్ .. 'మహా' డ్రామాను రక్తి కట్టిస్తున్న షాకింగ్ ట్వీట్లు

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. షాకింగ్ ట్విస్ట్ లతో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక తాజాగా అజిత్ పవార్ ఎన్సీపీ, బిజెపి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తాను ఎన్సీపీ లోనే ఉన్నానని ట్వీట్ చేయడంతో రేగిన సంచలనం అంతా ఇంతా కాదు. దీనికి కౌంటర్ గా శరద్ పవార్ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. మొత్తానికి ఎన్సిపి నేతలు మహా రాజకీయాలను ఏం చేయబోతున్నారు అన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మహా రాజకీయాల్లో అజిత్ , శరద్ ల ట్వీట్ వార్

మహా రాజకీయాల్లో అజిత్ , శరద్ ల ట్వీట్ వార్

మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన నేత అజిత్ పవార్ ఇప్పుడు షాకింగ్ ట్వీట్ చేసారు. ఒకపక్క అజిత్ పవార్ ను డిప్యూటీ సీఎంగా రాజీనామా చేసి ఎన్సీపీ లోకి రావాలని ఎన్సీపీ ఒత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో భాగంగా తాజాగా అజిత్ పవార్ చేసిన ట్వీట్ మహా రాజకీయాలను మలుపు తిప్పుతుందా అన్న అనుమానం వ్యక్తం అవుతుంది.

మహారాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టిస్తూ బీజేపీకి మద్దతు ఇచ్చి ఏకంగా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు అజిత్ పవార్.

తాజాగా ఆసక్తికర ట్వీట్ చేసిన అజిత్ పవార్

తాజాగా ఆసక్తికర ట్వీట్ చేసిన అజిత్ పవార్

ఎన్సీపీలో చీలిక తెచ్చి బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు కారకుడైన అజిత్ పవార్ తాజాగా చేసిన ట్వీట్ మహారాష్ట్ర రాజకీయాలను గందరగోళంలో పడేస్తోంది. ఏం జరుగుతుందో అన్న అయోమయం సృష్టిస్తోంది. ఒకపక్క అజిత్ పవార్ నిన్న చేసిన పనికి శాసనసభా పక్ష నేతగా ఆయనను తొలగిస్తూ ఎన్సీపీ నిర్ణయం తీసుకుంది. ఇక తాజాగా అజిత్ పవార్ ను ఎన్సీపీలోనే కొనసాగాలని కోరి మంతనాలు జరిపినట్టు సమాచారం . ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా అజిత్ పవార్ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఎన్సీపీలోనే ఉన్నా ... బీజేపీ , ఎన్సీపీలు ఐదేళ్ళ పాటు పాలన చేస్తాయని అజిత్ ట్వీట్

ఎన్సీపీలోనే ఉన్నా ... బీజేపీ , ఎన్సీపీలు ఐదేళ్ళ పాటు పాలన చేస్తాయని అజిత్ ట్వీట్


తాను ఇప్పటికీ ఎన్సీపీలోనే ఉన్నానని, ఎల్లప్పటికీ తమ నాయకుడు శరద్ పవారేనంటూ అజిత్ ట్విట్టర్ లో వెల్లడించారు. అంతేకాదు, మహారాష్ట్రలో వచ్చే ఐదేళ్లపాటు తాము బీజేపీ-ఎన్సీపీ కూటమి ప్రజారంజక పాలన సాగిస్తుంది అంటూ ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు . ఇక ఈ వ్యాఖ్యలు మహా రాజకీయ వర్గాలను ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి చేశాయి. నిన్నటికి నిన్న , శరద్ పవార్ వ్యాఖ్యానిస్తూ అజిత్ పవార్ నిర్ణయం వ్యక్తిగతమని, ఆయన నిర్ణయంతో పార్టీకి సంబంధం లేదని తేల్చిచెప్పారు. అజిత్ నిర్ణయాన్ని ఎన్సీపీ స్వాగతించడంలేదని స్పష్టం చేశారు.

తప్పు దారి పట్టించే ప్రయత్నం , కావాలని మిస్ గైడ్ చేస్తున్నారు అజిత్ అని శరద్ ట్వీట్

తప్పు దారి పట్టించే ప్రయత్నం , కావాలని మిస్ గైడ్ చేస్తున్నారు అజిత్ అని శరద్ ట్వీట్

ఇక అజిత్ పవార్ తాజా ట్వీట్ పై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. అజిత్ పవార్ చేసిన ట్వీట్ కు శరత్ పవార్ రివర్స్ ట్వీట్ చేశారు . బీజేపీతో కలిసి ఎన్సిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రశ్నే లేదని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఎన్సీపీ , కాంగ్రెస్ శివసేన లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. అజిత్ పవార్ స్టేట్మెంట్ తప్పు స్టేట్మెంట్ అని , కేవలం అందరిని సందిగ్ధానికి గురిచేసి,మిస్ గైడ్ చేసే ప్రయత్నంలో భాగంగానే అజిత్ పవార్ ట్వీట్ చేశారని ఆయన ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు.

ట్వీట్ లతో రక్తి కడుతున్న మహా హైడ్రామా

ట్వీట్ లతో రక్తి కడుతున్న మహా హైడ్రామా

ఇక అజిత్ పవార్, శరద్ పవార్ ల మాటలు, ఎవరి మాటలు నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కాని స్థితిలో శివసేన, కాంగ్రెస్ పార్టీలు కన్ఫ్యూజన్ కు గురవుతున్నాయి. ఎన్సీపీ ఎవరి కొంప ముంచుతుందో అన్న అనుమానం అన్ని రాజకీయ పార్టీల్లో నెలకొంది. మొత్తానికి మహారాష్ట్రలో కొనసాగుతున్న మహా డ్రామాలో ఎన్సీపీ మాత్రం అన్ని సీన్లను రక్తి కట్టిస్తుంది. తాజాగా ట్వీట్ వార్ కూడా ప్రారంభించి అందర్నీ షాక్ కు గురి చేసింది.

English summary
The political consequences of Maharashtra are becoming interesting. What happens with shocking twists is not understood. Recently, Ajit Pawar tweeted that the NCP and the BJP would form the government together in maharashtra . Sharad Pawar's tweet as a counter to this is now circulating in political circles. he is confusing and he misleading the parties. ncp support to shivsena and congress unanimously sharad pawar tweeted, Overall, the debate about what NCP leaders are going to do with big politics has now become a hot topic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X