వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కసబ్ కంటే కుల్ భూషణ్ జాద్ పెద్ద ఉగ్రవాది: అందుకే ఉరి శిక్ష, ముషరఫ్ !

భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ అతి పెద్ద ఉగ్రవాది అంటూ పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషరఫ్ మరోసారి నోరుపారేసుకున్నాడు.

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ అతి పెద్ద ఉగ్రవాది అంటూ పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషరఫ్ మరోసారి నోరుపారేసుకున్నాడు. అంతే కాకుండా అతను పాకిస్థాన్ లో తిరుగుతూ ఎన్ని వందల మందిని హత్య చేశాడో తెలియడం లేదని ఆరోపిస్తున్నాడు.

పాకిస్థాన్ కు చెందిన ఏఆర్ వై అనే మీడియాకు ఇంటర్వూ ఇచ్చిన పర్వేజ్ ముషరఫ్ అనేక పాడుకూతలు కూశాడు. భారత్ మీద ఉన్న పగతో మరోసారి మరోసారి నోరుపారేసుకున్నాడు. అంతే కుండా ముంబై మారణకాండలో పాల్గొన్న పాక్ ఉగ్రవాది కసబ్ కంటే కుల్ భాషణ్ జాదవ్ ఎంతో ప్రమాదం అని అభివర్ణించాడు.

Ajmal Kasab pawn, Kulbhushan Jadhav a terrorist, says Musharaff

కుల్ భూషణ్ జాదవ్ కచ్చితంగా ఉగ్రవాది అని మరీ బల్లగుద్ది చెప్పాడు. కసబ్ కేవలం ఒక్కదాడిలోనే (ముంబై) పాల్గొన్నాడు. భారత్ కసబ్ ను ఉరి తీసింది. అయితే పాకిస్థాన్ లో గుట్టుచప్పుడు కాకుండా తిరుగుతున్న కుల్ భూషణ్ జాదవ్ ఎంతో మందిని హత్య చేసి ఉంటాడని ముషరఫ్ ఆరోపించాడు. అందుకే పాక్ ప్రభుత్వం జాదవ్ కు ఉరి శిక్ష వేసిందని సమర్థించుకుంటున్నాడు.

ముంబై మారణకాండలో కసబ్ విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ అనేక మంది అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న వీడియో క్లిప్పింగ్ లు పోలీసులు సేకరించారు. అయితే కుల్ భూషణ్ జాదవ్ కు సంబంధించిన ఒక్క ఆధారం ఇప్పటి వరకు పాక్ బయట పెట్టలేదు.

కసబ్ కేవలం ఒక్కదాడిలోనే (ముంబై) పాల్గొన్నాడు. భారత్ కసబ్ ను ఉరి తీసింది. అయితే పాకిస్థాన్ లో గుట్టుచప్పుడు కాకుండా తిరుగుతున్న కుల్ భూషణ్ జాదవ్ ఎంతో మందిని హత్య చేసి ఉంటాడని, అందుకే ఉరి శిక్ష వేశారని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషరఫ్ అన్నాడు.

English summary
Musharaff during the interview raised questions about the case being contested by Pakistan.According to former Pakistani military dictator, Kulbhushan Jadhav is a bigger terrorist than Ajmal Kasab.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X