వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటికొచ్చి కాఫీ తాగి.. స్నేహితురాలిపై ఆత్యాచారం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో పరిచయాలు కొంత మందికి స్నేహితులను పరిచయం చేస్తే.. మరికొంత మందికి చేదు అనుభవాలను మిగిల్చింది. ఫేస్‌బుక్‌లో స్నేహితుడిగా భావించి అమాయకంగా స్నేహిం చేసిన ఓ మహిళ అత్యాచారం కాబడింది.

వివరాల్లోకి వెళితే రాజస్ధాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌లో ఉంటున్న ఓ 28 ఏళ్ల మహిళకు షఫీ అలియాస్ షేక్ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యాడు. ఆ మహిళతో మాటలు కలిపేందుకు తనకు వివాహం కాలేదని.. నాగౌర్ జిల్లాలోని ఆదర్శనగర్‌లో ఉంటున్నానని చెప్పాడు.

Ajmer woman allegedly raped by Facebook friend

ఇద్దరూ ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేసుకోవడంతో పాటు కొన్ని రోజుల తర్వాత ఫోన్ నెంబర్లను ఒకరికిఒకరు మార్చుకున్నారు. వాట్సఫ్ ద్వారా ఫోన్‌లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. గత వారం మహిళ కుటుంబం బయటకు వెళ్లిన సమయంలో షఫీ నేరుగా ఆ మహిళ ఇంటికి వచ్చాడు.

స్నేహితుడిగా భావించిన ఆ మహిళ షఫీకి కాఫీ ఇచ్చింది. ఈ సమయంలో ఒంటరిగా ఉన్న ఆ మహిళపై అత్యాచారం చేశాడు. దీంతో చేసేది ఏమీ లేక ఆ మహిళ రాంగంజ్ పోలీసులను ఆశ్రయించింది. మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

English summary
Making friendship via Facebook proved costly to a 28-year-old woman as she was raped by a man who met her on the social networking site. The woman lodged a complaint and the police recorded her statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X