వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యే ఇంటిలో ఏకే- 47 సీజ్, గ్యాంగ్ స్టర్, పగ తీర్చుకున్నారు, రాజకీయాల్లోకి వచ్చి !

|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ కు చెందిన స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యే ఇంటిలో మారణాయుధాలు పెట్టుకుని హల్ చల్ చేస్తున్నాడని ఆరోపణలు రావడంతో పోలీసు అధికారులు దాడులు చేశారు. స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యే ఇంటిలో ఏకే-47తో పాటు మారణాయుధాలు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. గ్యాంగ్ స్టర్ అయిన ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయినా నేర సామ్రాంజ్యంతో లింక్ లు మాత్రం వదలలేదని పోలీసులు అంటున్నారు.

బీహార్ లోని మోకామ శాసన సభ నియోజక వర్గం స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ ఇంటిలో ఏకే-47తో పాటు ఇతర మారణాయుధాలు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నామని శనివారం పోలీసు అధికారులు తెలిపారు. అనంత్ కుమార్ సింగ్ ఓ పెద్ద గ్యాంగ్ స్టర్.

AK-47 rifle recovered from the residence of Independent MLA from Mokama in Bihar.

రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయిన తరువాత అనంత్ కుమార్ సింగ్ అతని నేర సామ్రాజ్యంతో సంబంధాలు కొనసాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు, బాంబు నిర్వీర్యదళం అధికారులు, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అధికారులతో పాటు వంద మందికి పైగా పోలీసులు అనంత్ కుమార్ సింగ్ ఇంటి మీద దాడి చేశారు.

నేర సామ్రాంజ్యంతో సంబంధాలు కొనసాగిస్తున్నాడని సమాచారం అండడంతో నడావా గ్రామంలోని అనంత్ కుమార్ సింగ్ ఇంటి మీద దాడి చేసి ఏకే- 47తో సహ మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు తెలిపారు. దాడి చేసిన తరువాత మెజిస్ట్రేట్ సమక్షంలో ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ ఇంటిని సీజ్ చేశారు.

ఈ విషయంపై ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ మండిపడుతున్నారు. తన ఇంటి మీద పోలీసులు దాడి చెయ్యలేదని, ఏకంగా ఇంటిని ద్వంసం చేశారని ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ ఆరోపించారు. శాసన సభ ఎన్నికల్లో లలన్ సింగ్ మీద పోటీ చేసి తాను ఎమ్మెల్యే అయ్యానని, అందుకే తన మీద ద్వేషం పెంచుకుని ఇలా కేసుల్లో ఇరికిస్తున్నారని స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ ఆరోపించారు. ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ కు ఏకే- 47తో సహ మారణాయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
AK-47 rifle recovered from the residence of Independent MLA from Mokama in Bihar, Anant Kumar Singh, in a raid by Police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X