వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Akali Dal-BSP alliance: పంజాబ్‌లో కొత్త పొత్తు-27 ఏళ్ల తర్వాత మళ్లీ జతకడుతున్న అకాలీదళ్-బీఎస్పీ

|
Google Oneindia TeluguNews

వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీ దళ్(ఎస్ఏడీ).. మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)తో జతకట్టనుంది. ఈ మేరకు రెండు పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కుదిరిందని శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తెలిపారు. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌లో బీఎస్పీ 20 సీట్లలో,శిరోమణి అకాలీదళ్ 97 సీట్లలో పోటీ చేస్తుందని తెలిపారు. పంజాబ్ రాజకీయాల్లో ఇదొక కొత్త మలుపు అని అభిప్రాయపడ్డారు.

27 ఏళ్ల తర్వాత...

27 ఏళ్ల తర్వాత...

బీఎస్పీ జనరల్ సెక్రటరీ సతీశ్ చంద్ర మిశ్రా మాట్లాడుతూ... పంజాబ్ రాజకీయాల్లో ఇది చారిత్రాత్మకమైన రోజు అన్నారు. శిరోమణి అకాలీదళ్-బీఎస్పీ పొత్తు పంజాబ్ రాజకీయాలను మలుపు తిప్పుతుందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 20 స్థానాల్లో పోటీ చేస్తామన్నారు.1996 లోక్‌సభ ఎన్నికల తర్వాత శిరోమణి అకాలీదళ్-బీఎస్పీలు జతకట్టడం ఇదే మొదటిసారి.అప్పటి ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్తుతో బరిలో దిగగా... 13 లోక్‌సభ స్థానాలకు గాను 11 స్థానాలను కైవసం చేసకున్నాయి. ఇందులో అకాలీదళ్ 10 స్థానాల్లో పోటీ చేసి 8 స్థానాల్లో విజయం సాధించగా... బీఎస్పీ 3 స్థానాల్లో పోటీ చేసి మూడింటిలో విజయం సాధించింది.

ఎన్డీయే నుంచి తప్పుకున్న అకాలీదళ్...

ఎన్డీయే నుంచి తప్పుకున్న అకాలీదళ్...

గత 23 ఏళ్లుగా శిరోమణి అకాలీదళ్ బీజేపీ మిత్రపక్షంగా ఎన్డీయే కూటమిలో కొనసాగిన సంగతి తెలిసిందే. గతేడాది కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఎన్డీయే నుంచి ఆ పార్టీ తప్పుకుంది. మొదట ఆ పార్టీకి చెందిన ఎంపీ హర్ సిమ్రత్ కౌర్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకే శిరోమణి అకాలీదళ్ ఎన్డీయే నుంచి వైదొలిగింది. రాబోయే పంజాబ్ ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి గత వారమే సుఖ్‌బీర్ సింగ్ బాదల్ హింట్ ఇచ్చారు. కాంగ్రెస్,బీజేపీ,ఆమ్ ఆద్మీ మినహా ఏ పార్టీతోనైనా పొత్తుకు సిద్దమని ప్రకటించారు.

బీఎస్పీతో పొత్తు కలిసొస్తుందా?

బీఎస్పీతో పొత్తు కలిసొస్తుందా?


పంజాబ్‌లో దళితుల జనాభా దాదాపు 40 శాతంగా ఉంది. ముఖ్యంగా దోబా ప్రాంతంలోని 23 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళితుల ఓటు బ్యాంకే ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో బీఎస్పీతో పొత్తు తమకు కలిసొస్తుందని శిరోమణి అకాలీదళ్ భావిస్తోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ బీజేపీ పొత్తుతో బరిలో దిగగా... పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అనూహ్యంగా ఆ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ 20 స్థానాల్లో గెలుపొందింది. శిరోమణి అకాలీదళ్ పోటీ చేసిన 94 స్థానాల్లో కేవలం 15 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. బీజేపీ 23 స్థానాల్లో పోటీ చేసి కేవలం మూడు స్థానాల్లో విజయం సాధించింది. ఒకరకంగా బీజేపీ స్థానాన్ని శిరోమణి అకాలీదళ్ ఇప్పుడు బీఎస్పీతో భర్తీ చేస్తోంది.

English summary
Shiromani Akali Dal (SAD) will join hands with Mayawati-led Bahujan Samaj Party (BSP) in next year's Punjab Assembly elections. Shiromani Akali Dal chief Sukhbir Singh Badal said a seat sharing agreement had been done between the two parties. In Punjab, which has 117 assembly seats, the BSP will contest 20 seats, while the Shiromani Akali Dal will contest 97 seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X