వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆకాశ్-శ్లోకల పెళ్లి ఎప్పుడు, ఎక్కడ, ఎన్ని రోజులు అంటే? బ్యాచిలర్ పార్టీ మాత్రం స్విస్‌లో

|
Google Oneindia TeluguNews

ముంబై: రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీ పెళ్లి మార్చి 9వ తేదీన శ్లోకా మెహతాతో జరగనుంది. రస్సెల్ మెహతా, మోనా మెహతాల కూతురు శ్లోక. ఈ పెళ్లి ముంబైలో జరగనుంది. మూడు రోజుల పాటు పెళ్లి సంబరాలు ఉంటాయి. 2018లో ముఖేష్ అంబానీ కూతురు ఈషా అంబానీ పెళ్లి ఆనంద్ పిరమిల్‌తో జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొడుకు ఆకాశ్ పెళ్లి కోసం సిద్ధమవుతున్నారు.

ఆకాశ్ - శ్లోకల పెళ్లి ఎప్పుడు, ఎక్కడ అంటే?

ఆకాశ్ - శ్లోకల పెళ్లి ఎప్పుడు, ఎక్కడ అంటే?

ఆకాశ్ అంబానీ, శ్లోకల నిశ్చితార్థం 2018లో జరిగింది. మార్చి 9, 2019 శనివారం నాడు పెళ్లి జరగనుంది. ఈ పెళ్లి వేడుక ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ సెంటర్‌లో జరగనున్నాయి. మంగల్ భరత్ ముంబైలో శనివారం ఉదయం గం.3.30కు ఉంటుంది. ప్రముఖులు పెళ్లికి హాజరవుతారు. అకాశ్, శ్లోకల పెళ్లి సాయంత్రం 7.30లకు జరుగుతుంది. ఆ తర్వాత పెళ్లి సెలబ్రేషన్స్ మార్చి 10వ తేదీన (ఆదివారం) జరగనున్నాయి. ఇది కూడా జియో వరల్డ్ సెంటర్‌లో ఉంటుంది. ఆ తర్వాత అదే వేదికలో మార్చి 11న వెడ్డింగ్ రిసెప్షన్ ఉంటుంది.

బ్యాచిలర్ పార్టీ

బ్యాచిలర్ పార్టీ


ఆకాశ్ అంబానీ వివాహానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆకాశ్‍‌కు వజ్రాల వ్యాపారి కుమార్తె శ్లోకా మెహతాతో గతేడాది వైభవంగా నిశ్చితార్ధం జరిగింది. త్వరలో పెళ్లి కానుంది. ఈ నేపథ్యంలో ఆకాశ్‌ బ్యాచిలర్‌ పార్టీని స్విట్జర్లాండ్ల్‌లో నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఈ నెల 23 నుంచి 25 వరకు అక్కడే బ్యాచిలర్‌ పార్టీ వేడుకలు జరగనున్నాయని తెలుస్తోంది.

మూడు రోజుల పాటు బ్యాచిలర్ పార్టీ

మూడు రోజుల పాటు బ్యాచిలర్ పార్టీ

బ్యాచిలర్ పార్టీ కోసం ఆకాశ్‌ స్నేహితులైన బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌, దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ స్విస్‌కు ప్రయాణం కానున్నారని తెలుస్తోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు భారత్‌ నుంచి రెండు ప్రత్యేక విమానాలు స్విట్జర్లాండుకు వెళ్లనున్నాయి. స్విస్‌లోని అత్యంత విలాసవంతమైన సెయింట్‌ మోరిట్జ్‌ హోటల్‌ వేదికగా జరిగే ఈ కార్యక్రమానికి ఐదువందల మంది అతిథులు రానున్నారని తెలుస్తోంది.

English summary
Reliance chairperson Mukesh Ambani and Nita Ambani's oldest son Akash Ambani is tying the knot with Shloka Mehta, daughter of diamantaire Russell Mehta and Mona Mehta in March this year. The Ambanis ended 2018 on a high with the wedding of their daughter Isha to Anand Piramal, son of Ajay and Swati Piramal, and this year, the family is all set to celebrate the wedding of Akash and Shloka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X